EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / Gossips / లోయలోకి జారుతున్న బస్సును ఓ జేసీబీ ఆపరేటర్ సమయస్ఫూర్తి 80 మంది ప్రాణాలను కాపాడిన రియల్ హీరో

లోయలోకి జారుతున్న బస్సును ఓ జేసీబీ ఆపరేటర్ సమయస్ఫూర్తి 80 మంది ప్రాణాలను కాపాడిన రియల్ హీరో

Author:

కొండగట్టు బస్సు ప్రమాదంలో 61 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన గుర్తుందా..? కేరళలోనూ ఇలాంటి తరహా ఘటనే జరిగింది. కానీ కపిల్ అనే జేసీబీ ఆపరేటర్ సమయస్ఫూర్తితో 80 మంది ప్రాణాలను కాపాడాడు. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు చెందిన ఓ బస్సు కేరళలోని రాజక్కాడ్‌కు వెళుతోంది. ఎరచ్చిపార వద్ద ఆ బస్సు అదుపుతప్పి రోడ్డు కిందకి దూసుకెళ్లింది. బస్సు లోయలోకి పడబోతున్న తరుణంలో అక్కడే ఉన్న కపిల్ తన జేసీబీని అక్కడికి తీసుకెళ్లాడు.

తమిళనాడులో ఓ కొండ ప్రాంతంవైపు ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సు(TNSTC) వెళ్తోంది. బస్సులో 80మందికి పైగా ప్రయాణికులున్నారు. ఎక్కువ రద్దీ ఉన్న బస్సు…. ఎత్తువైపు వెళ్తుండటంతో… డ్రైవర్ కంట్రోల్ తప్పాడు. బ్రేకులు పడక పోవడంతో.. కంట్రోల్ తప్పి బస్సు వెనక్కి జారిపోతోంది. రోడ్డుకు కొద్ది దూరంలోనే ఉన్న ఇరుకైన భారీ లోయ వైపు జారిపోతోంది. ఊహించని ప్రమాదంలో పడేసరికి ప్రయాణికులంతా భయంతో అరుస్తున్నారు.రోడ్డుమీద నుంచి దిగువకు జారిపోతున్న బస్సును కపిల్ అనే ఓ జేసీబీ డ్రైవర్ చూశాడు. వెంటనే పరుగెత్తి.. జేసీబీ తీసుకుని.. బస్సుకు ఎదురుగా వెళ్లాడు. గేర్ లోనే బండిని ఆపి… ఫ్రంట్ హ్యాండిల్ తో బస్సును ఆపేశాడు.

kerala jcb driver turns super hero

మరింత కిందకు జారిపోకుండా బస్సు అక్కడే ఆగిపోయింది. ఆ పక్కనే భారీ లోయ ఉంది. బస్సు ఆగిపోవడంతో.. ప్రయాణికులంతా హడావుడిగా దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. తమ ప్రాణాలు కాపాడిన దేవుడివంటూ కళ్లవెంట నీళ్లు పెట్టుకుంటూ అతడికి ధన్యవాదాలు చెప్పారు. తమకు పునర్జన్మ ప్రసాదించిన దేవుడివంటూ దండం పెట్టారు. ప్రాణాలు దక్కడంతో జనం అంతా ఊపిరిపీల్చుకున్నారు.

కపిల్ కేరళలోని ఇడుక్కి ప్రాంతానికి చెందిన జేసీబీ డ్రైవర్. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే కపిల్ పనిచేస్తుండటం..  బస్సు ప్రమాదాన్ని గుర్తించడం.. ఆలస్యం చేయకుండా తాను జేసీబీతో బస్సును ఆపడం ప్రయాణికుల అదృష్టం అని చెప్పాలి. లోయలోకి జారిపోతున్న బస్సును చూడగానే సమయస్ఫూర్తితో వెంటనే పరుగెత్తి , జేసీబీని బస్సువైపు నడపడం.. చివరకు దానిని ఆపడంలో ఆయన చూపిన తెగువ…. అతడిని సూపర్ మ్యాన్ ను చేసింది.

(Visited 1 times, 1,748 visits today)