Home / Political / మా రక్తం తో చేతులు కడుక్కున్నావ్, నువ్వు హీరోకాదు, విలన్ వి

మా రక్తం తో చేతులు కడుక్కున్నావ్, నువ్వు హీరోకాదు, విలన్ వి

Author:

Vijay Mallya is villain

ఉద్యోగులకు చాలాకాలంగా వేతనాలు చెల్లించకుండా, ఇప్పుడు దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్న కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ యజమాని విజయ్ మాల్యాకు ఆ సంస్థ ఉద్యోగులు శనివారం నాడు ఘాటైన బహిరంగ లేఖ రాశారు. తమ రక్తంతో ఆయన చేతులు తడుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మిస్టర్ మాల్యా!..కింగ్‌ఫిషర్ ఉద్యోగులుగానే కాకుండా పన్ను కడుతున్న ఈ దేశ పౌరులుగా ఈ ఉత్తరం మీకు రాస్తున్నాం. మీరు మా పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యంతో మేం తీవ్రమైన బాధ, ఆక్రోశంలో ఉన్నాం. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్(కేఎఫ్‌ఏ) గురించి మాట్లాడుతూ ‘ఎలాంటి విచారం’ లేదన్న మీ వ్యాఖ్యలు మమ్మల్ని ఎంతో బాధించాయి. మా వరకు మాకు కేఎఫ్‌ఏ ఇంకా ఉనికిలోనే ఉంది. జీతాలు చెల్లించకపోయినా జీతాల పట్టిలో మా పేర్లు ఉన్నాయి. సంస్థను మళ్లీ ప్రారంభిస్తామని మీరు హామీ ఇచ్చినా.. మీ నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. దేశంలోని కుళ్లిన వ్యవస్థ గురించి మాకు తక్కువ తెలుసు… కానీ మీలాంటి వ్యక్తుల పుణ్యమా అని దేశంలో ఉన్న అసలు పరిస్థితి ఎంత నిస్సహాయంగా ఉందో అర్థమైంది. అది సామాన్యమానవుడికి ఆత్మహత్యాసదృశంగా మారింది. ఆ సామాన్యుడు నిజాయతీగా, క్రమం తప్పకుండా చెల్లించే పన్నులను మీ లాంటివాళ్లు, రాజకీయ నాయకులు బ్యాంకులతో కుమ్మక్కై దోచుకుంటున్నారు. సీబీఐ ఇచ్చిన అన్ని సలహాల పట్ల బ్యాంకులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించాయో విస్మయం కలిగిస్తోంది. అవినీతికి పాల్పడ్డ బ్యాంకర్లపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. సొంతంగా చర్యలు తీసుకోవడంలో సీబీఐ అంత బలహీనంగా ఉందా? ఎందుకు మీపై క్రిమినల్ చర్యలు తీసుకోలేదు? ఎందుకు సాధారణ పౌరుడే ఆదాయపు పన్ను శాఖకు భయపడాలి.? పన్నులు చెల్లించే వారిని అపహాస్యం చేయటం కోసమేనా ఎస్‌బీఐ ఇంత ఆలస్యంగా తీవ్రస్థాయిలో స్పందించింది? పన్ను చెల్లించేవారి విషయంలో ప్రభుత్వం ఎందుకు జవాబుదారీగా ఉండదు? మా ప్రశ్నలకు ఆర్థిక శాఖ, పీఎంఓ జవాబులు చెప్పాలి. పన్నుచెల్లింపుదారులకు ఈ వ్యవస్థపై తిరిగి విశ్వాసం కలిగించాలి.

మీలాంటివారు మా డబ్బుతో కంపెనీ పెట్టి దోపిడీచేసి సిగ్గులేకుండా మూసేస్తున్నారు. ‘జీతాలు చెల్లించేందుకు నా దగ్గర డబ్బులేదన్న’ మీ మాటలకు అర్థం ఏమిటి? కరేబియన్ ప్రీమియర్ లీగ్, విలాసవంతమైన పడవ కోసం డబ్బులెక్కడి నుంచి తెచ్చి ఖర్చుపెట్టారు? ఈ కుళ్లిన వ్యవస్థలోని బ్యాంకులు, దర్యాప్తు సంస్థలు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ, పోలీసులు, మీడియా సంస్థలు.. వెన్నుదన్నుతో మీరు హాయిగా తప్పించుకోగలుగుతారు. మీడియా సంస్థలు ఎందుకిలా వ్యవహరిస్తున్నాయో అర్థం కావటం లేదు. సామాన్యుడి పట్ల ఉదాసీనతా? లేక మీరు వారిని ప్రభావితం చేయటం వ్లనా? మిమ్మల్ని హీరోగా, బాధితుడిగా ఎలా చెప్పగలుగుతున్నాయి? అదే సమయంలో మన సైనికులు, ఆకలిచావులు, రైతుల ఆత్మహత్యలు వీటి గురించి ఎందుకు పట్టించుకోవు.. కార్పొరేట్ ప్రపంచంలో మాదిరిగా సామాన్యుడిని పోలీసులు వినియోగదారుడిగా భావించేలా సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు మీడియా సంస్థలు ప్రయత్నించిన నాడు మేం సంతోషిస్తాం. మీలో ఇప్పటికీ పశ్చాత్తాపం లేదు. దేశ ప్రతిష్టకు ముఖ్యంగా విమానయాన రంగానికి ఎంతో అప్రతిష్ట తీసుకొచ్చారు… దీని వల్ల కొత్తగా రావాలనుకునే కంపెనీలు విమానాల్ని అద్దెకు తీసుకోవడమే చాలా కష్టంగా మారింది.

ప్రతి ఒక్కరికీ తెలుసు మీరు సంపాదించిన ఈ సొమ్మును మీ కొడుకు కూడా మొత్తం ఖర్చుచేయలేడని.. అలాంటప్పుడు కనీసం మా జీతాలైనా మాకు ఇవ్వవచ్చుకదా? మిమ్మల్ని ఇంకా గొప్పవాడిగా భావిస్తున్న ప్రజల కోసమైనా, పీహెచ్‌డీలు, అవార్డులిచ్చి సత్కరిస్తున్న అంతర్జాతీయ సంస్థల కోసమైనా మీ బాధ్యతల నుంచి తప్పుకోండి. మా బకాయిలు చెల్లించడంలో ప్రధాని సాయం చేస్తారని భావిస్తున్నాం. లేదంటే మా హక్కులకు మేం దూరమవుతాం.

మాల్యా… మీ హృదయం మలినమైంది. మీ చేతులకు రక్తం అంటుకుంది. మీకు ఇంకా ఎన్నో చెప్పాలనుకున్నాం. వినే ఓపిక, సమయమూ మీకు లేదు. త్వరగా కోలుకోండి..
– కింగ్‌ఫిషర్ ఉద్యోగులు, భారతదేశ పౌరులు

(Visited 276 times, 6 visits today)