Home / Entertainment / బాహుబలి కలెక్షన్స్ ని దాటేసిన ఖైదీ నెంబర్ 150

బాహుబలి కలెక్షన్స్ ని దాటేసిన ఖైదీ నెంబర్ 150

Author:

దాదాపు పది సంవత్సరాలు సినిమాలకి దూరం అయిన మెగాస్టార్ క్రేజ్ ఇంకా పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు అనడానికి ఖైదీ నెంబర్ 150 సినిమాకి వచ్చిన రెస్పాన్స్ యే నిదర్శనం, చిరంజీవి సినిమాలని వదిలేసినా తరువాత ఆ స్థాయికి ఏ హీరో చేరుకోలేకపోయాడు, చిరంజీవి స్టామిన ఏంటో ఖైదీ నెంబర్ 150 కి వచ్చిన కలెక్షన్స్ తో తెలిసిపోయింది.

Khaidi number 150 first day collections

తెలుగు రాష్ట్రాలలో బాహుబలి సృష్టించిన రికార్డులని తిరగరాస్తూ మెగాస్టార్ సరికొత్త రికార్డుని సృష్టించారు, తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు వసూలైన కలెక్షన్స్ లో 22.4 కోట్ల షేర్ తో తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన బాహుబలి సినిమా మొదటి స్థానంలో ఉంది, పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా 20.92 కోట్ల షేర్ తో రెండో స్థానంలో ఉంది, ఇక ”ఖైదీ నెం 150” మాత్రం అనూహ్యంగా ఏకంగా 23.24 కోట్లు షేర్ వసూలు చేసేసి.. నెం.1 స్థానంలోకి వచ్చేసింది.

Comments

comments