EDITION English తెలుగు
మూవీ రివ్యూ: 'పేట'   మూవీ రివ్యూ:వినయ విధేయ రామ   మూవీ రివ్యూ:యన్.టి.ఆర్‌ -కథానాయకుడు   5 రూపాయలు తీసుకొని అటే ఉడాయించి ఉంటాడు,అనుకున్న వ్యక్తికీ. సార్ మీ ఛాయ్..అన్న పిలుపుతో అతను షాక్ కు గురయ్యాడు.అసలు ఏమైందో తెలుసా..?   ఈ క్యాబ్ డ్రైవ‌ర్ రాత్రి పూట అవ‌స‌రం ఉన్న వారిని ఉచితంగా క్యాబ్‌లో ఇంటి దగ్గ‌ర దింపుతాడు. ఎందుకో తెలుసా..?   మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు కరెక్ట్ అర్థం ఈ జంటే... వీరి కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. రియల్ స్టోరీ..!   మూవీ రివ్యూ: పడి పడి లేచె మనసు   పొరిగింటి రెండేళ్ల చిన్నారి కోసం...చనిపోతూ ఈ తాత ఇచ్చిన విలువైన బహుమతి ఏంటో తెలుసా..?   కేంద్రం సంచలన నిర్ణయం...! ఇకపై ఆధార్ అడిగితే కోటి జరిమానా...జైలు శిక్ష! వివరాలు ఇవే!   ఎంతపెద్ద జ్వరమైనా ఈ ట్రిక్ పాటిస్తే సింపుల్ గా తగ్గిపోద్ది.! కావాల్సింది పెసరపప్పు ఒక్కటే.!
Home / General / FDRI బిల్లు తో సామాన్యుల్లో గుబులు…బ్యాంకు నుండి మన డబ్బులు మనం తీసుకోలేం..!

FDRI బిల్లు తో సామాన్యుల్లో గుబులు…బ్యాంకు నుండి మన డబ్బులు మనం తీసుకోలేం..!

Author:

ఇప్పుడు ప్రతి చోట..ప్రతి ఇంట్లో ఒకటే చర్చ..ఒకటే గుబులు.. FDRI బిల్లు గురుంచే.. ఈ బిల్లు వస్తే బ్యాంకుల్లో మన అకౌంట్ లోని డబ్బులు మనవి కాకుండా పోతాయా..? మనకి అవసరం ఉన్న బ్యాంకులు మన డబ్బులు ఇవ్వవా..? మన డబ్బులు బ్యాంకులే సొంతానికి వాడుకుంటాయా..? ఇలాంటి ప్రశ్నలు సామాన్య ప్రజలని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి…

అసలు FRDI బిల్లు లో ఏముంది అంటే…. బ్యాంకులు కొన్ని లక్షల కోట్ల రూపాయలని కొన్ని కార్పొరేట్ సంస్థలకి, పెద్ద పెద్ద కంపెనీలకి అప్పులుగా ఇస్తున్నాయి, వాటిలో చాలా కంపెనీలు నష్టాలు వచ్చాయని చెప్పుకొని బ్యాంకులకు తిరిగి అప్పు చెల్లించకుండా ఉన్నాయి వాటినే మొండి బకాయిలు (ఉదా: విజయ్ మాల్యా) అంటాం, ఇలా ఇప్పటివరకు దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు మొండి బకాయిలగా ఉన్నాయి, ఇలా ఇష్టం వచ్చినట్లు అప్పులు ఇచ్చేసి ఇప్పుడు ఆ బకాయిలు వసూలు కావట్లేవు అనే పేరుతో బ్యాంకులు ఖాతాదారుల నుండి డబ్బులు వసూలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం రూపొందిస్తుంది అదే FDRI బిల్లు.

గతంలో ఏదైనా బ్యాంకు పూర్తి నష్టం జరిగి దివాలా తీస్తే కేంద్ర ప్రభుత్వం కొంత పెట్టుబడిని సహాయంగా అందించి ఆ బ్యాంకు తన రుణ సమస్యల నుంచి గట్టెక్కడానికి చేయూతనిచ్చేది… దీన్ని ‘‘బెయిల్‌-అవుట్‌’’ ప్యాకేజీ అనేవారు. దీని ద్వారా డిపాజిటర్ల సొమ్ముకు కచ్చితమైన భద్రత ఉండేది. కానీ కొత్త FDRI బిల్లు లో కేంద్రం ‘‘బెయిల్‌-ఇన్‌’’ అనే క్లాజు చేర్చింది. బెయిల్‌ అవుట్‌ క్లాజ్‌కు ఈ బెయిల్‌-ఇన్‌ అనేది పూర్తిగా విరుద్ధమైనది. రిజల్యూషన్‌ కార్పొరేషన్‌ అనే వ్యవస్థ ఏర్పాటుకు ఈ బిల్లులో వీలు కల్పించారు. అంటే బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి ఏర్పడినప్పుడు వెంటనే ఈ కార్పొరేషన్‌ రంగ ప్రవేశం చేసి దాన్ని టేకోవర్‌ చేసి ఆ బ్యాంకు ఖాతాదారుల(ఖాతాదారులకు తెలియకుండానే) సొమ్ముని బ్యాంకుకి బదలాయించి బ్యాంకుకి ఉన్న మొండి బకాయిలని సర్దుబాటు చేస్తుంది.

ఈ బిల్లు అమల్లోకి వస్తే ఎక్కువగా నష్టపోయేది సామాన్య ప్రజలే.. చదువు కోసం అని, పెళ్లి కోసం అని, ఇల్లు కోసం అని దాచుకున్న డబ్బులు మనకి తెలియకుండానే మన అకౌంట్ నుండి మాయం అవ్వొచ్చు, కాకపోతే ఈ పరిస్థితి పెద్ద బ్యాంకులకు రాకపోవచ్చు..

(Visited 561 times, 44 visits today)