సదర్ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న రూ.11 కోట్ల దున్నపోతు.

Author:

సంవత్సరానికి కోటి రూపాయలకి పైగానే సంపాదిస్తున్న ఈ దున్నపోతు పేరు యువరాజ్, దీనిని హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర జిల్లా సునారియో గ్రామానికి చెందిన కరమ్ వీర్ సింగ్ అనే వ్యక్తి పెంచుతున్నాడు, సంవత్సరానికి కోటి రూపాయలకి పైగా ఆదాయం తెచ్చిపెడుతున్న ఈ దున్నపోతు విలువ రూ.11 కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో రికార్డులని సృష్టించిన యువరాజ్ ఇప్పుడు హైదరాబాద్ లో జరిగే సదర్ పండుగ ఉత్సవాలకి వస్తున్నాడు.

sadar-festival-hyderabad-yuvaraj

దీపావళి ఉత్సవాలలో భాగంగా సదర్ పండుగని దీపావళి తరువాతి రెండు రోజులు నిర్వహిస్తారు, హైదరాబాద్ ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా ఈ వేడుకలని నిర్వహిస్తున్నారు, ఈ ఉత్సవాలని యాదవులు మాత్రమే జరుపుకుంటారు, పవన్ కళ్యాణ్ జానీ సినిమాలోని ఒక పాటలో “సదర్ పండుగా వచ్చిందా..! పట్నంలో మనవాళ్ళు దున్నపోతులని ఆడిస్తూ దిల్ ఖుషిలు చేస్తారు” అని ఉంటుంది, ఆ పాటలో ఉన్నట్లుగానే ఈ పండుగని చాలా వైభవంగా నిర్వహిస్తారు, దున్నపోతులని అందంగా అలంకరిస్తారు, అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం ఈ ఉత్సవ ప్రత్యేక విశేషం. ఈసారి వేడుకలలో ఈ యువరాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.

sadar-festival-in-hyderabad

యువరాజ్ ప్రత్యేకతలు:

  • దీని ఎత్తు : 6 అడుగులు. పొడవు : 14 అడుగులు, బరువు : 1800 కిలోలు.
  • విలువ రూ.11 కోట్ల రూపాయలు.
  • యువరాజ్ ఆహారం : రోజుకు 15కిలోల యాపిల్స్, 30 లీటర్ల పాలు, ఐదు కిలోల బత్తాయి, కిలో కాజు, కిలో బాదం, ఐదు కిలోల బెల్లం, దానా, గడ్డి, వివిధ రకాల పప్పుల పొట్టు, మొక్క జొన్న పొట్టు.
  • వ్యాయాయం కోసం ప్రతిరోజూ యువరాజ్ ని ఐదు కిలోమీటర్లు నడిపిస్తారు.
  • దున్నపోతు యువరాజ్ వీర్యానికి విదేశాల్లో మంచి డిమాండ్. వీర్యం ద్వారానే ఇది ఏడాదికి కోటి రూపాయలు ఆదాయం తీసుకొచ్చిపెడుతుంది.
  • యువరాజ్ సంరక్షణ కోసం ఎల్లప్పుడూ 10 మంది యువకులు పనిచేస్తుంటారు.

హర్యానా నుండి హైదరాబాద్ కి (1800 కిలోమీటర్లు) ఏసీ కంటైనెర్ లో తీసుకొస్తున్నారు, 2015 లో జరిగిన సదర్ ఉత్సవాలకి కూడా ఈ యువరాజ్ ని తీసుకొచ్చారు, ఈసారి ఉత్సవాలకి యువరాజ్ తో పాటు యువరాజ్ కుటుంబసభ్యులని కూడా తీసుకొస్తున్నారు.

sadar-hyderabad

ఈ నెల 31 న ముషీరాబాద్ లో, నవంబర్ 1 న నారాయగూడలో ఎడ్ల హరిబాబు యాదవ్ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలు జరగనున్నాయి, ఈ ఉత్సవాలని మరియు యువరాజ్ ని చూసేందుకు నగర ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.

(Visited 2,874 times, 156 visits today)

Comments

comments