EDITION English తెలుగు
ఈ రోజు: 18-10-2018 (గురువారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   ఈ రోజు: 18-10-2018 (గురువారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   సుప్రీం మరోకీలక నిర్ణయం: వెంటనే డైవర్స్ తీసుకోవచ్చు   రెండు వారాల్లోనే హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ…ఐదుగురు మృతి   ఈ రోజు: 17-10-2018 (బుధవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   హాస్పిటల్స్‌లో రోగుల ప‌క్క‌నే ఉంచే హార్ట్ బీట్ మెషిన్‌ను ఏమ‌ని పిలుస్తారో, అందులో రీడింగ్స్‌ను ఎలా చ‌ద‌వాలో తెలుసా..?   ఆరోగ్యం,భోజ‌నం, చ‌దువు, అంతా…..ఈ వాత్స‌ల్యం సంస్థే అండ‌గా నిల‌బ‌డ‌తుది   'తిత్లీ' బాధితులకు సంపూర్ణేష్ బాబు, విజయ్ దేవరకొండ, తారక్‌, కల్యాణ్‌రామ్‌ సాయం   మనుషుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం చివరిసారి చెప్పిన కథ.... తప్పక చదవండి.   కొన్ని యూట్యూబ్‌ చానెళ్లపై గీతామాధురి సీరియస్‌ వార్నింగ్‌

ఈ రెండు సంద‌ర్భాల్లో టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. అవేంటో తెలుసా..?

Author:

ప్రభుత్వం ప్రజల రవాణా సౌకర్యార్థం ఏటా కొత్తగా హైవేలు నిర్మిస్తూనే ఉంటుంది. అయితే ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త‌గా నిర్మించిన లేదా నిర్మించ‌బోయే జాతీయ ర‌హ‌దారుల‌పై టోల్ టాక్స్ వేస్తార‌ని అంద‌రికీ తెలిసిందే. ఇక ఆ రోడ్ల‌పై 4 వీలర్స్ లేదా 4 + వీలర్స్ ఎవరు వెళ్లినా టోల్ టాక్స్ క‌ట్టాల్సిందే. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్య‌మంత్రి, ప్ర‌ధాని, గ‌వ‌ర్న‌ర్‌, రాష్ట్ర‌ప‌తి, న్యాయ‌మూర్తులు లాంటి వీఐపీలకు మాత్రమే ఈ టోల్ నుంచి మిన‌హాయింపు ఉంటుంది. వీరు త‌ప్ప మిగతా ఎవ‌రైనా టోల్ టాక్స్ క‌ట్టి తీరాల్సిందే. లేదంటే, టోల్ గేట్ కూడా దాట‌నివ్వ‌రు అక్క‌డి సిబ్బంది. ఇదంతా మనం గమనిస్తున్నదే. అయితే మనలాంటి సామాన్యుడికి కూడా టోల్ నుంచి మినహాయింపు ఉంటుందట. ఎప్పుడంటే అప్పుడు కాదు.. ఒక రెండు సందర్భాల్లో మాత్రమే సుమా. ఆ రెండు సంద‌ర్భాల్లో మాత్రం మనం కూడా ఎలాంటి టోల్ కట్టకుండా జుయ్ మంటూ గేటు దాటి దూసుకుపోవచ్చంట. సంబంధిత మంత్రిత్వ శాఖ గ‌తంలో ఎప్పుడో ప్ర‌వేశ‌పెట్టినప్పటికీ సరైన ప్రచారం లేకపోవడంతో వీటి గురించి ఎవరికీ అవగాహన లేదు. ఇంతకీ ఆ 2 సందర్బాలు ఏంటంటే…

no need to pay toll charges

  • టోల్ గేట్ నుంచి 200 మీట‌ర్ల దూరం వ‌ర‌కు ట్రాఫిక్ జామ్ అయితే, మనం టోల్ క‌ట్ట‌కుండానే గేట్ దాటి వెళ్ల‌వ‌చ్చు.
  • టోల్ గేట్ కు కొద్ది దూరంలో ఒక పసుపు రంగు లైన్ ఉంటుంది. ఆ లైన్‌కు అవ‌త‌ల ఎవ‌రైనా 5 లేదా అంత‌క‌న్నా ఎక్కువ నిమిషాల పాటు వేచి ఉన్న‌ట్ట‌యితే వారు కూడా టోల్ క‌ట్టాల్సిన ప‌నిలేదు. నేరుగా గేట్ నుంచి వెళ్లిపోవ‌చ్చు.

కాబట్టి, మీకు ఎప్పుడైనా ఇలాంటి సంద‌ర్భాలు గనక ఎదురైతే, టోల్ చెల్లించ‌కండి. ఒక వేళ టోల్ సిబ్బంది ఇబ్బంది పెట్టినా, వాదించినా.. ఈయొక్క 2 రూల్స్ క‌చ్చితంగా చెప్పండి. టోల్ బాదుడు నుండి తప్పించుకోండి.

అయితే ఎక్కడో పేపర్ల మీద ఉండే ఈ రూల్స్ నిజంగా సాధ్యమా ? బాదుడికి అలవాటు పడ్డ టోల్ సిబ్బంది అంత సులువుగా మనల్ని వదులుతారా అనేది అనుమానమే… తమ కాల పరిమితి ముగిసినా కూడా జనాలను దోచుకునే టోల్ వ్యవస్థ ఉన్న ఈ రోజుల్లో ఈ రూల్స్ గురించి మనం మాట్లాడినా ఎవరన్నా వింటారా? అనేది ప్రశ్న.

(Visited 1,660 times, 355 visits today)