EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!

Author:

ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే వందల కోట్లు వెనకేసుకునే రాజకీయ నాయకులూ ఉన్న కాలం ఇది, అలాంటిది నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండటానికి సొంతఇల్లు సంపాదించని నాయకుడు నిజంగా ఉన్నాడు అంటే నమ్ముతారా..? కానీ నమ్మి తీరాల్సిందే.. త్రిపుర రాష్ట్రానికి 1998 నుండి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న మాణిక్ సర్కార్ పేరుమీద ఉన్న ఆస్తి రూ.3930 మాత్రమే.. అందులో రూ.2410 బ్యాంకు అకౌంట్ లో ఉండగా మిగిలిన రూ.1520 అయన దగ్గర ఉన్నాయి, అంతేకాదు ఆయనకు వ్యవసాయ భూములు గానీ ఇళ్ల స్థలాలు గానీ ఏవీ లేవు. తన ముఖ్యమంత్రి పదవికి ప్రభుత్వం నుంచి అందే వేతనం రూ.26 ,315 మొత్తాన్ని పార్టీకి విరాళంగా ఇస్తూ.. పార్టీ నుంచి జీవనభృతిగా నెలకు రూ.5 వేలు మాత్రం పొందుతున్నారు ఈ మాణిక్ సర్కార్.

అయితే మాణిక్ సర్కార్ భార్య పేరిట ఉన్న అన్ని రకాల ఆస్తులూ కలిసి రూ.యాభై లక్షల విలువ ఉంటాయి. కానీ అవన్నీ ఆమె వ్యక్తిగతం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి చేసి రిటైర్ అయిన మాణిక్ సర్కార్ భార్య ఉద్యోగ సమయంలో వచ్చిన జీతంతో, రిటైర్మెంట్ అప్పుడు ఇచ్చే డబ్బులతో ఈ ఆస్తులని సంపాదించింది.

మాణిక్ సర్కార్ ఆస్తులు

ఇప్పటికే వరుసగా నాలుగుసార్లు త్రిపురకి ముఖ్యమంత్రిగా పనిచేసిన మాణిక్ సర్కార్ ఐదోసారి కోసం నామినేషన్ వేశారు, నామినేషన్ లో ముఖ్యమంత్రి సమర్పించిన ఆస్తి వివరాలు చూసి దేశ ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు, ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఎలాంటి అక్రమాలకి పాల్పడకుండా, సన్నిహితులకి, కుటుంబ సభ్యులకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించకుండా నిజాయితీగా ఉండటం చాలా గొప్ప విషయం, ఆ నిజాయితీ మాణిక్ సర్కార్ లో ఉంది కాబట్టే త్రిపుర ప్రజలు ఆయననే నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేసారు, ఐదోసారి కూడా మాణిక్ సర్కార్ నే ముఖ్యమంత్రిని చేయబోతున్నారు, ఇలాంటి నాయకులు అన్ని రాష్ట్రాలలో ఉండి ఉంటే మనదేశం ఎప్పుడో అభివృద్ధి చెందివుండేది అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.

(Visited 408 times, 442 visits today)

Comments

comments