EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Devotional / గాయత్రీ మంత్రం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి.

గాయత్రీ మంత్రం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి.

Author:

ఓం భూర్భువః సువః తత్ సవితుర్వ రేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ !!

ఇదే గాయత్రీ మంత్రం, ఈ గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని, మహిమాన్వితమైనదని విజ్ఞులు భావిస్తారు. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని ఋగ్వేదములో చెప్పబడింది. ఒకప్పుడు కొన్ని వర్ణాల వారు మరియు వేదం పాఠశాలలో మాత్రమే దీన్ని ప్రత్యేకమైన నిర్దిష్టమైన పద్దతిలో జపించడం చేసేవారు. కాని మారుతున్న కాలంతో పాటు అందరికి అందుతున్న విజ్ఞాన ఫలాల వల్ల ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని అందరూ పఠిస్తున్నారు మరియు అందరూ వింటున్నారు. ఈ పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్దతిలో జపించినా లేదా విన్నా ఆ మంత్రం నుండి వెలువడే ధ్వని తరంగాలు మన మనసుని, శరీరాన్ని ఉల్లాసపరిచి, తేజోవంతం చేస్తాయి తద్వారా మనోబుద్ధి వికసిస్తుంది అని పెద్దలు నమ్ముతారు.

gayatri mantram

దీనిని ప్రయోగాత్మకంగా నిరూపించడానికి పలువులు ప్రయత్నాలు కూడా చేసారు. ఎలాగైతే ఒక బ్రిడ్జ్ మీద సైనికులంతా నిల్చుని క్రమపద్ధతిలో మార్చ్ ఫాస్ట్ చేస్తే వెలువడే ధ్వని తరంగాల ద్వారా ఆ బ్రిడ్జిని కూల్చేయవచ్చో. అదే పద్దతిలో ఈ గాయత్రీ మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్దతిలో జపిస్తే మన శరీరం మనకు తెలీకుండానే ఎన్నో వైబ్రేషన్స్ కి గురవుతుంది అంతే కాకుండా మన మెదడులో కూడా ఒక రకమైన ఆనందంతో, పాజిటివ్ థాట్స్, కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా పెరుగుతాయట. దీని పై పలు విదేశీ విశ్వ విద్యాలయాలు రకరకాల పరిశోధనలు నిర్వహిస్తున్నారు.

గాయత్రీ మంత్రం గురించి వేదాల ప్రకారం పండితుల వివరణతో చెప్పాలంటే, ‘సవిత’ గాయత్రీ మంత్రమునకు అధిష్టాన దేవత. అగ్ని ముఖము, విశ్వామిత్రుడు ఋషి. గాయత్రీ ఛందము. ప్రణవ రూపమైన ఓం కారమునకు నేను వందనం చేస్తున్నాను. విశ్వాన్ని ప్రకాశింప చేస్తున్న సూర్య తేజమైన సవితాను నేను ఉపాసిస్తున్నాను అని గాయత్రీకి ఉన్న వివిధ అర్థాలలో ఒకటి. గాయత్రి మంత్రాన్ని జపించువారు వారి మెదడులో నిరంతరం కొనసాగు ప్రకంపనలను అనుభవం పొందుతారు. వారు ఎప్పుడు జాగరూకతతో నిజజీవితాన మసలుకుంటుంటారు. ఈ విధంగా విజయాలను సొంతం చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఓ వ్యక్తి గాయత్రిని సూచించిన విధంగా లయబద్ధంగా జపిస్తాడో, దాదాపు లక్ష శక్తి తరంగాలు అతని తలచుట్టూ ఉద్భవిస్తాయి. గాయత్రి మంత్రోపాసన ఒక వ్యక్తిని తెలివైనవాడిగా, ధైర్యవంతుడిగా చేస్తూ తరగనంతటి అనుకూల శక్తి సామర్థ్యాలను అతనిలో నింపుతుంది. అయితే ఈ వాదనలతో ఏకీభవించని వారు కూడా చాలా మంది ఉన్నారు.

Comments

comments