EDITION English తెలుగు
Home / health / ఏ అర్ధరాత్రో సడన్ గా మేల్కొంటున్నారా ? ఎందుకలా జరుగుతుందో తెలుసా ?

ఏ అర్ధరాత్రో సడన్ గా మేల్కొంటున్నారా ? ఎందుకలా జరుగుతుందో తెలుసా ?

Author:

రోజంతా ఆఫీస్ పని, ఇంటి పనులతో బిజీ బిజీ గా గడిపే మనం రాత్రవగానే ఆటోమేటిక్ గా నిద్రపోతాం. కొందరు ఇలా బెడ్ ఎక్కగానే అల్లా గుర్రు పెట్టి మరీ నిద్రలోకి జారుకుంటారు. ఇంకొందరికి మంచంలో పడుకున్నాక గంట అయితే కానీ నిద్ర పట్టదు. ఆకలి రుచెరుగదు, నిద్ర సుఖమెరుగదు అంటాం. అంటే విపరీతమైన ఆకలి తో ఉంటె రుచి ఉన్నా లేకున్నా తినేస్తామని, అలాగే నిద్ర తన్నుకొస్తే ఎక్కడ ఎలా అన్నది కూడా చూడకుండా పడిపోతాం..నిద్రలోకి జారుకుఉంటామని సామెత. కాని కొంతమందికి ఎంత అలసిపోయి నిద్రపోతున్న ప్రతి రోజు మధ్యలో సడెన్ గా మెలకువ వస్తుంటుంది. ఇలా వచ్చే మెలకువ కి చాల కారాణాలు ఉంటాయి. మీకు రోజు మెలకువ వచ్చే సమయాన్ని బట్టి మీ సమస్యను క్రింద తెలుసుకోండి.

రాత్రి 9 నుంచి 11 గంటల మధ్యలో మెలకువ వస్తే:

ఈ సమయంలోనే చాలా మంది నిద్రకు ఉపక్రమిస్తారు. ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు 9 కి పడుకొని 11 లోపు మధ్యలో నిద్ర లేస్తున్నారంటే వారి మెదడు ఎదో విషయం గురించి ఎక్కువగా అలోచిస్తుందని అర్దం. ఇలాంటి వారిని ఆ విషయం గురించి కనుక్కొని దాని గురించి ఆలోచించకుండా చేయగలిగితే తరువాత రోజు నుండి ప్రశాంతంగా నిద్రపోతారు.

రాత్రి 11 నుంచి 1 మధ్యలో మెలకువ వస్తే:
ఈ సమయంలో మన శరీరం తీసుకున్న ఆహరంలోని ఫ్యాట్స్ కరుగుతుంటాయి. ఈ మధ్యలో మెలుకువ వస్తుందంటే ఆ వ్యక్తి మానసిక ఒత్తిడికి గురై ఆందోళనలతో ఉండే అవకాశం ఉంది లేదంటే శరీరంలో ఎక్కువగా అన్ హెల్దీ ఫ్యాట్స్, ఆయిల్స్ చేరి ఉంటాయి. కుటుంబ సభ్యౌలతో మాటాలడడం ద్వారా మానసిక ఆందోళనలు తగ్గించి లేదా ఆయిల్ తక్కువగా ఉండే ఆరోగ్యకరమైనా ఆహరం తీసుకోవడం వలన ఈ సమయంలో వచ్చే మెలకువ ని ఆపవచ్చు.

రాత్రి 1 నుంచి 3 మధ్యలో మెలకువ వస్తే:

ఈ సమయంలో సడన్ గా మెలకువ వస్తుందంటే వారు కిడ్ని లేదా లివర్ సంబదిత ఇబ్బందులతో సతమతమవుతున్నారని అర్థం. ఈ సమయంలో లివర్ శరీర మలినాలను విడుదల చేస్తుంది మరియు శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది. రోజు ఈ సమయంలో లేచే వారి కిడ్ని, లివర్ సరిగా పనిచేస్తున్నాయో టెస్ట్ చేయించడం మేలు. లేట్ నైట్ వరకు ఆల్కహాల్ తాగి నిద్రపోయిన చాలా మందికి ఈ టైంలోనే మెలుకువ వస్తుంది. ఈ సమస్యను తగ్గించాలంతే ప్రతిరోజు వ్యాయామం, ప్రాణాయామం చేయాలి. ఆల్కహాల్ మితంగా తీసుకోవాలి.

రాత్రి 3 నుంచి 5 మధ్యలో మెలకువ వస్తే:

ఈ సమయంలో సడన్ గా మెలకువ వస్తుందంటే శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అర్దం. సాధరణంగా ఈ సమయంలో ఊపిరితిత్తులకు ఎక్కువ ఆక్షిజెన్ అవసరం, కాని శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వలన నిద్రాభంగం జరుగుతుంది. వీరు ఏదైనా నిర్దిష్టమైన లక్షం ఏర్పరుచుకొని హార్డ్ వర్క్ చేయడం, వ్యాయామం, ముఖ్యంగా బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయడం వల్ల ఉపసమనం పొందుతారు.

ఉదయం 5 నుంచి 7 మధ్యలో మెలకువ వస్తే:

జనరల్ గా ఇది అందరూ మెల్కొనే సమయమే. ఇది శరీరం టాక్సిన్లను బయటకు పంపే శరీరాన్ని క్లియర్ చేసే సమయం కాబట్టి చాలా మందికి ఈ సమయంలో మెలకువ వస్తుంది. ఈ సమయంలో మెలకువ వస్తే మీకు ఎటువంటి సమస్య లేనట్లే. కాని ఆ సమయానికి మెలకువ రానట్లైతే మీరు సరైన సమయపాలన పాటించట్లేదని అర్థం. అది ఆహారంలో కావచ్చు, నిద్రలో కావచ్చు. రెగ్యులర్ గా ఒక టైం టేబుల్ లాగ టైం కి తిని టైం కి పడుకుంటే వారికి ఈ సమస్య తగ్గిపోతుంది. రాత్రి కొంచం త్వరగా పడుకోవడం, యోగా లాంటివి చేసినా ప్రశాంతమైన నిద్ర వీరికి సొంతమయి రోజు ఉదయాన్నే మెలుకువ వస్తుంది. ఒకసారి మీ నిద్రా సమయాల్ని, మెలకువ వచ్చే సమయాల్ని సరి చూసుకుని..ఇబ్బందులని తొలగించుకుంటే ప్రశాంతమైన నిద్ర పొందగలరు. మీ శారీరక మానసిక ఆరోగ్యం కూడా బాలన్సుగా ఉంటుంది. ఆరోగ్యమే మహా భాగ్యం కదా!!!

(Visited 1,910 times, 60 visits today)