EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / సాహిత్యం / కోడూరి విజయకుమార్ కవిత

కోడూరి విజయకుమార్ కవిత

Author:

Koduri Vijay Kumar

R E C U S E D

తప్పించుకు తిరుగుతావు లోకం నుండి
లేక, లోకమే నీ నుండి …..
కొన్ని మాటలు లుంగలు చుట్టుకు పోయి
ఎవరితోనూ పంచుకోలేక గొంతు దగ్గరే ఆగిపోతాయి
లేక, గొంతు లోపల చిక్కుకున్న మాటల్ని
వినే తీరిక ఏదీ ఎవరికీ మిగలక …..
ఏదో పంచుకోవాలని ఆశపడి
మిత్రుడొకరికి కాల్ చేసి భంగపడతావు
ఆ తరువాతెపుడో మిత్రుడి కాల్ వొచ్చినా
‘ పంచుకోవడానికి బాధలు లేకుండా
ఈ భూమ్మీద మిగిలినదెవరని’ వొదిలేస్తావు
ముఖ పుస్తకం తెరలు తెరలుగా
కబుర్లు చెబుతుంది ఎప్పటిలాగే
కాసిని కబుర్లని దోసిట్లోకి తీసుకుని
పాలిపోయిన నీ ముఖాన్ని పరిశుభ్రం చేసుకుని
‘స్టేటస్ ‘ పై తగిలించ మనసొప్పదు …..
భోరున వర్షం కురిసిన కాళరాత్రి
నగరపు వరదల్లో ఎక్కడో చిక్కుకుపోయినపుడు
నీ భార్యా పిల్లలే నీకై ఆందోళనగా ఎదురుచూస్తారు
బహుశా, నీవూ, నేనూ, అతడూ, ఆమే …
ఎవరెవరు ఏ వరదల్లో
ఎక్కడెక్కడో చిక్కుబడిపోయినా
మనకోసం ఎదురు చూసేది మన ఇల్లే కదా
మరి, మనదైన ఇల్లు కూడా లేకపోతేనో ?!
   — కోడూరి విజయకుమార్

(Visited 170 times, 47 visits today)