EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / General / మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి….! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!

మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి….! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!

Author:

‘‘మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి.. అయ్యా! మేం.. కోరుట్ల జెడ్పీ బాలికల హైస్కూల్‌లో చదువుతున్నాం. 540 మందిలో 320 మంది బాలికలం. మా బడిలో సరిపడా మరుగుదొడ్లు, మూత్రశాలలు, నీటి వసతి లేదు. అన్నం తిన్న తర్వాత తాగడానికి నీళ్లు లేక తలా కొన్ని డబ్బులు జమ చేసి కొనుక్కుంటున్నం. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు.

9వ తరగతి సాంఘికశాస్త్రంలో ‘బాలల హక్కులు–పరిరక్షణ’ పాఠంలో బాలలు సమస్యలు ఉంటే నేరుగా ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తే పరిష్కరిస్తారని చదివాం. అందుకే ఈ లేఖ రాస్తున్నాం.. తప్పయితే క్షమించండి” ఇది.. పది హేను రోజుల క్రితం జగిత్యాల జిల్లా కోరుట్ల జెడ్పీ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ సారాంశం.

మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి..

కోరుట్ల ప్రభుత్వ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఉన్న టాయిలెట్స్ లో ఒక్క టాయ్‌లెట్‌ మాత్రమే పనిచేస్తోంది. మిగిలినవి మరమ్మతులు చేయాల్సి ఉంది. పాఠశాలలో బోరు దెబ్బతినగా..బాగు చేయించే వారులేరు. ప్రతిరోజు ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుక్కుంటున్నారు. పిల్లలు ఈ నీటిని తాగలేక సొంత డబ్బులతో బయట కొనుక్కుని తాగుతున్నారు. మధ్యాహ్న భోజనానికి వంటగది, డైనింగ్‌ హాల్‌ లేక విద్యార్థులు ఆరుబయట మధ్యాహ్న భోజనాలు చేస్తున్నారు. కూలిన తరగతి గదుల్లోనే కొన్ని తరగతులు కొనసాగుతున్నాయి. పాఠశాల సమస్యలపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు విన్నవించిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇద్దరు విద్యార్థునులు హైకోర్టు న్యాయమూర్తికి పాఠశాలలో ఉన్న సమస్యల గురుంచి లేఖ రాశారు.

మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి..

విద్యార్థినులు రాసిన లెటర్ కి స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి కోరుట్ల ఉన్నత పాఠశాలలో వెంటనే వసతుల కల్పనకి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు, ద్యార్థులు రాసిన లేఖతో నిద్రమత్తు వదిలిన జిల్లా విద్యాశాఖ అధికారులు కోరుట్ల పాఠశాలని సందర్శించి వసతుల కల్పనకు రూ.11 లక్షలతో అంచనాలు తయారు చేసారు. దీనిలో 4 మూత్రశాలలు, బోర్‌వెల్, వాటర్‌ ట్యాంకు నిర్మాణానికి రూ.2 లక్షలు, మోటార్‌కు రూ.50 వేలు, 4 గదులకు రూ.8 లక్షలు, మరుగుదొడ్లు.. టాయ్‌లెట్ల మరమ్మతుకు రూ.5 వేలు కేటాయిస్తూ అంచనాలు తయారుచేశారు. నిధుల మంజూరుకు విద్యా శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శికి జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు నివేదిక అందించారు.

Comments

comments