‘రాయబారి’ కోసం అప్పుడే వేట మొదలెట్టిన క్రిష్.

Author:

Rayabari

క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్…. విలువలతో కూడిన కథాంశాలను ఎంచుకొని తెలుగు తెరపై తనదైన సంతకాన్ని లిఖించారాయన. వాణిజ్య అంశాలతో సినిమాలను మలచినా… తన మార్క్ సందేశాన్ని మాత్రం క్రిష్ మరిచిపోరు. తన ‘గమ్యం’ ఏంటో తొలి సినిమాతోనే చెప్పేశారు. తను చేసిన సినిమాలు చూస్తే గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, కంచె. ఈ సినిమాలలో ప్రతి ఒక సినిమాలో కూడా సగటు మానవ జీవితన్ని ఆవిష్కారించాడు.

ఇప్పుడు క్రిష్ నుంచి రానున్న మరో సినిమా ‘రాయబారి’. మెగా హీరో వరుణ్ తేజ్ ని హీరోగా ఎంపిక చేసాడు. అయితే ఇదివరకే వరుణ్ తో కంచె చేసిన విషయం మనకు తెలిసిందే, కంచె సినిమాలో వరుణ్ నటన చూసి మళ్ళీ తనతోనే తన తదుపరి సినిమా అని కంచె రీలిజైన కొద్దిరోజులకే చేప్పెశాడు క్రిష్. ఇప్పటికే స్క్రిప్ట్ పనులను దాదాపు పూర్తి చేసిన లొకేషన్స్ కి వేటలో ఉన్నారు. తెలుగులో ఎప్పుడో ఓ సారి వచ్చే స్పై థ్రిల్లర్ జానర్లో ఈ సినిమా రూపొందనుంది. అలాగే ఈ సినిమాలో యూనివర్సల్ కాన్సెప్ట్ ఉండడం వలన పలు ఫారిన్ లొకేషన్స్ లో సినిమాని షూట్ చేయనున్నారు. లొకేషన్స్ మరియు నటినటులను ఫైనలైజ్ చేసి మార్చి నుంచి సినిమాని మొదలు పెట్టే ఆలోచనలో ఈ చిత్ర టీం ఉంది.

(Visited 63 times, 14 visits today)