ట్విట్టర్ లో నాని, కేటీఆర్ ల చిట్ చాట్..!

Author:

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికి వెంటనే సాయం అందేలా చర్యలు తీసుకుంటూ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. నేచురల్‌ స్టార్‌గా నాని తన సహజమైన నటనతో అభిమాన హీరోగా యువతకు రోల్‌ మోడల్‌గా నిలుస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు వీరిద్దరి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. ఓ యువకుడు తన ఎదురుగా కూర్చున్న విద్యార్థులకు తన రోల్‌ మోడల్స్‌ గురించి వివరిస్తూ.. ప్రొజెక్టర్‌పై కేటీఆర్‌, నాని ఫొటోలను ప్రదర్శించాడు. ఈ ఫొటోను హేమంత్‌ అనే నెటిజన్‌ కేటీఆర్‌కు ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు.

ktr-nani (1)

ఈ ఫొటో చూసి స్పందించిన కేటీఆర్‌.. ‘వావ్‌! ఇది ఎక్కడ జరిగిందో కానీ.. నాకు చాలా నచ్చింది. పక్కనే నాని కూడా మంచి కంపెనీ ఇచ్చారు’ అని ట్వీట్‌ చేశారు. కేటీఆర్‌ ట్వీట్‌కి నాని కూడా సమాధానం ఇచ్చారు. ‘నేనూ అదే ఫీలవుతున్నా బ్రదర్‌. ఈ ఫొటో చూడగానే నా ముఖంలో చిరునవ్వులు పూశాయి. థ్యాంక్యూ’ అని నాని ట్వీట్‌ చేశారు.

(Visited 186 times, 218 visits today)