EDITION English తెలుగు
మూవీ రివ్యూ: 'పేట'   మూవీ రివ్యూ:వినయ విధేయ రామ   మూవీ రివ్యూ:యన్.టి.ఆర్‌ -కథానాయకుడు   5 రూపాయలు తీసుకొని అటే ఉడాయించి ఉంటాడు,అనుకున్న వ్యక్తికీ. సార్ మీ ఛాయ్..అన్న పిలుపుతో అతను షాక్ కు గురయ్యాడు.అసలు ఏమైందో తెలుసా..?   ఈ క్యాబ్ డ్రైవ‌ర్ రాత్రి పూట అవ‌స‌రం ఉన్న వారిని ఉచితంగా క్యాబ్‌లో ఇంటి దగ్గ‌ర దింపుతాడు. ఎందుకో తెలుసా..?   మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు కరెక్ట్ అర్థం ఈ జంటే... వీరి కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. రియల్ స్టోరీ..!   మూవీ రివ్యూ: పడి పడి లేచె మనసు   పొరిగింటి రెండేళ్ల చిన్నారి కోసం...చనిపోతూ ఈ తాత ఇచ్చిన విలువైన బహుమతి ఏంటో తెలుసా..?   కేంద్రం సంచలన నిర్ణయం...! ఇకపై ఆధార్ అడిగితే కోటి జరిమానా...జైలు శిక్ష! వివరాలు ఇవే!   ఎంతపెద్ద జ్వరమైనా ఈ ట్రిక్ పాటిస్తే సింపుల్ గా తగ్గిపోద్ది.! కావాల్సింది పెసరపప్పు ఒక్కటే.!
Home / Inspiring Stories / సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫోటోలు..! చర్యలు తీసుకోండంటూ ఆదేశించిన కేటీఆర్..!

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫోటోలు..! చర్యలు తీసుకోండంటూ ఆదేశించిన కేటీఆర్..!

Author:

బతకటానికి పల్లె నుంచి పట్నం వచ్చాడు.. రోడ్డు పక్కన పుచ్చకాయలు అమ్ముకుంటున్నాడు. ట్రాఫిక్ పోలీసులు వచ్చారు. ట్రాఫిక్ జామ్ అవుతుందంటూ వెళ్లిపోవాలని చెప్పారు.  “నా ఇల్లు గడవాలంటే ఈ పండ్లు అమ్ముకోవాలయ్యా! కొంచెం కనికరించండి!” అని పోలీసులను బతిమాలాడు ఆ పేద వ్యాపారి, ఆ వ్యాపారి ఎంత బతిమాలిన వినిపించుకొని పోలీసులు పుచ్చకాయలని నేలకేసి కొట్టారు, “అయ్యా.. సారూ.. నాలుగు పుచ్చకాయలు అమ్మితేగానీ.. నాలుగు రూపాయలు మిగలవు.. ఇలా పాడుచేస్తే ఏం కావాలని” కాళ్లావేళ్లా పడ్డాడు అతను. అయినా వినని పోలీసులు ఆ పేద వ్యాపారి ఖాళీ చేసే వరకు పుచ్చకాయలని నేలకేసి కొడుతూనే ఉన్నారు. ఈ సంఘటన ఉప్పల్ లో జరిగింది.

Uppal-Police-Beaten-Watermelon-Vendor

అటుగా వెళుతున్న యువకుడు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ విషయం వైరల్ గా మారింది, మరికొందరు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మంత్రి కేటీఆర్ కు నేరుగా ట్విట్ చేశారు. పార్కింగ్ కు సౌకర్యాలు లేని షాపింగ్ మాల్స్ లో కూడా ఇలాగే వస్తువులు పడేస్తారా అంటూ కామెంట్స్ చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా..? అంటూ నెటిజన్లు సంధించిన ప్రశ్నకు వెంటనే సమాధానమిచ్చారు మినిస్టర్. ఈ ట్వీట్స్ కు స్పందించిన కేటీఆర్.. దాన్ని వెంటనే పోలీస్ బాస్ డీజీపీకి రీట్వీట్ చేశారు. ఈ ఘటనపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరారు. సామాన్యులతో ఎలా ఉండాలో జూనియర్ ఆఫీసర్లకు కౌన్సెలింగ్ ఇవ్వండంటూ ట్వీట్ చేశారు. వీళ్ల సంగతి చూడండి అంటూ డీజీపీని కోరారు. మంత్రి కేటీఆర్ స్పందనతో ఆయన ట్విట్టర్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

(Visited 2,070 times, 25 visits today)