ఒక్క ఫోన్ కాల్ తో మొబైల్ – ఆధార్ లింక్ చేసేయొచ్చు, మొబైల్ స్టోర్ కి వెళ్లాల్సిన అవసరం లేదు.

Author:

ఇప్పటికే బ్యాంకు అకౌంట్ లకి ఆధార్ లింక్ చేయడానికి డెడ్ లైన్ విధించిన కేంద్ర ప్రభుత్వం, మొబైల్ నెంబర్ కి కూడా ఆధార్ లింక్ చేయడానికి కూడా డెడ్ లైన్ మార్చి 31 వ తేదీ, మొబైల్ నెంబర్ కి ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి దగ్గరలో ఉన్న మొబైల్ నెట్ వర్క్ షోరూమ్ కి వెళ్లాల్సి రావడం, మొబైల్ నెంబర్ – ఆధార్ లింక్ సర్వీస్ ఉచితంగానే చేయాల్సి ఉన్న షోరూం వాళ్ళు డబ్బులు వసూలు చేస్తుండటంతో అధికారులు అనుకున్నంత రెస్పాన్స్ రావట్లేదు, ఈ క్రమంలోనే IVRS విధానంలో OTP ద్వారా లింక్ చేసుకునే విధానం తీసుకువచ్చింది కేంద్రం. జనవరి 2వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. ఈ కొత్త విధానంతో ఒక్క ఫోన్ కాల్ తో మొబైల్ నెంబర్ కి ఆధార్ లింక్ చేసేసుకోవచ్చు.

IVRS మొబైల్ నంబ‌ర్‌ను ఆధార్‌కు లింక్

మొబైల్ నెంబర్ – ఆధార్ లింక్ ఎలా చేసుకోవాలంటే..

  • ఆధార్ లింక్ చేయాలనుకున్న మొబైల్ నెంబర్ నుండి 14546 నెంబర్ కు కాల్ చేయాలి.
  • ఆ తరువాత ఏ భాష కావాలని ఆప్షన్స్ అడుగుతారు.. కావాల్సిన భాష సెలెక్ట్ చేసుకోవాలి.
  • ఇండియా లేదా NRI అనే ఆప్షన్ వస్తుంది. మనం సరైన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
  • ఆధార్ లింక్ చేసుకోవటం కోసం ఒకటి నెంబర్ ప్రెస్ చెయ్యాలి. లింక్ చేయాలనుకున్న ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి
  • ఆధార్ నెంబర్ సరిచూసుకుని కరెక్ట్ అనుకుంటే మళ్లీ ఒకటి ప్రెస్ చెయ్యాలి.
  • మీరు ఆధార్ కార్డు కోసం ఇచ్చిన మొబైల్ నెంబర్ కి (మీ ఆధార్ కార్డు డేటాలో ఏ మొబైల్ నెంబర్ అయితే ఉంటుందో ఉంటుందో) దానికి OTP వస్తుంది.
  • మొబైల్ నెంబర్ కరెక్టా.. కాదా చెక్ చేసుకునేందుకు చివరి నాలుగు నెంబర్స్ చెబుతుంది. ఓకే అనుకుంటే..OTP ఎంటర్ చేయాలి.
  • ప్రాసెస్ జరుగుతుందని.. 48 గంటల సమయం పడుతుందని మెసేజ్ వస్తుంది.
  • మీరు మరో నెంబర్ లింక్ చేసుకోవాలంటే.. రెండు నెంబర్ నొక్కి పైవిధంగా ప్రాసెస్ కంప్లీట్ చేయాలి.

ఇంట్లో ఉండే కేవలం ఒక్క ఫోన్ కాల్ చేసి రెండు నిమిషాల్లో IVRS సిస్టమ్ ద్వారా మొబైల్ నెంబర్ కి ఆధార్ నెంబర్ లింక్ చేసేయొచ్చు, ఈ సమాచారం అందరికి షేర్ చేయండి.

(Visited 404 times, 441 visits today)