Home / Inspiring Stories / ఇక ఆ రాష్ట్రం లో మధ్యం బంద్.

ఇక ఆ రాష్ట్రం లో మధ్యం బంద్.

Author:

Bihar CM Nithish Kumar Announces Liquor Prohibition In Bihar From April 2016

ఎన్నికల వాగ్దానాలు అమలు చేయటం మొదలు పెట్టేసింది బీహార్ ప్రభుత్వం.గుజరాత్, నాగాలాండ్, మణిపూర్, జైపూర్, లక్షద్వీప్ లలో మద్య నిషేధం అమల్లో ఉండగా ఇప్పుడు బీహార్ కూదా ఆ జాబితాలో చోటు చేసుకోనుంది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుండి రాష్ట్రంలో మద్యాన్ని నిషేధిస్తున్నట్టు ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ గురువారం ప్రకటించారు. ఎక్సైజ్‌ డే సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యాన్ని నిషేధిస్తామని హామీనిచ్చాం. ఇచ్చిన హామిని నిలబెట్టుకుంటున్నాం’  అంటూ చెప్పేసారు కూడా. ఈ నిషేదం వలన ప్రభుత్వం పై 400కోట్ల భారం పడనున్నా మహిళలు, పేదల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పటం లేదని ఆయన చెప్పారు. ఈ నిషేదం 2016, ఏప్రిల్‌ 1 నుండి అమలౌలోకి వస్తుందట. దీనికనుగు ణంగా కొత్త ఎక్సైజ్‌ విధానం ఏర్పాటు కార్యాచరణను ప్రారంభించాలని ఎక్సైజ్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కేకే పాఠ్క్‌, చీఫ్‌ సెక్రటరీ అంజనీ కుమార్‌ సింగ్‌లను ఆదేశించారు.

Liquor Prohibition In Bihar State

ఎన్నికల ప్రచారం సందర్భంలో ఈ విషయమై మహిళలు మద్యాన్ని నిషేధించాలని చేసిన విజ్ఞప్తి కి సానుకూలం గా స్పందించీన నితీష్, తిరిగి అధికారంలోకి వస్తే మద్యంపై తప్పక నిషేధం విధిస్తానని ఆనాడు హామీనిచ్చారు. ఎన్నికల్లో నితీష్‌కు అది ప్లస్‌పాయింట్‌ అయ్యింది. మద్యం దుష్ప్రయోజనాల గురించి చెబుతూ దీని దుష్ప్రభావం మహిళలపైనే అత్యధికంగా పడుతోందని, వారే బాధితులవుతున్నారన్నారు. పురుషులు మద్యానికి బానిసలుగా మారటంతో బీద కుటుంబాలు నాశనమౌతున్నాయని, అలాంటి కుటుంబాల ముఖంలో చిరునవ్వ చిందించే ప్రయత్నమే ఇదని నితీష్‌ చెప్పారు. మద్యం దుష్ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన పెంచడంలో ఎన్జీవోల పాత్ర అభినందనీయమని, ఇందులో రాణించిన వారిని అవార్డులతో సన్మానిస్తామని ముఖ్యమంత్రి అన్నారు.

ఇదిలా ఉండగా నిన్న పాట్నాలోని ప‌లు వార్తా ప‌త్రిక‌ల‌తో పాటు, న్యూస్ ఛానెళ్ల‌కు వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపింది. నితీష్ మద్య నిషేదం ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే వచ్చిన ఈ ఫోన్ కాల్ పోలీసులని కొంత సేపు ఖంగారు పడేలా చేసింది ఫోన్ చేసిన వ్యక్తి తాను బీహార్ సీఎం నితీష్‌కుమార్‌ను త్వ‌ర‌లోనే హ‌త మారుస్తాన‌ని,ఇందుకోసం భారీ స్థాయిలో బాంబులు పెట్టి నితీష్‌ను చంపేందుకు స్కెచ్ వేస్తున్నాన‌ని చెప్పి ఫోన్ పెట్టేశాడు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన అంద‌రూ మీడియా ప్ర‌తినిధులు ఈ విష‌యాన్ని పోలీసుల‌కు చెప్ప‌డంతో వారు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు.ఐతే అ ఆ ఫోన్ కాల్ చేసింది ఎవ‌రు.ఎక్క‌డ నుంచి వ‌చ్చింద‌నే వివ‌రాలు సేక‌రిస్తున్నారు.

(Visited 97 times, 6 visits today)