Home / Videos / పోలీసులనే హడలగొట్టిన రెండేళ్ళ చైనా బుడతడు

పోలీసులనే హడలగొట్టిన రెండేళ్ళ చైనా బుడతడు

Author:

చిన్న పిల్లలు సాధారణంగా కొత్త వారిని చూస్తే కొంత మొహమాటపడుతూ తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల వెనక్కి వెళ్లి దాక్కుంటారు. కానీ ఇక్కడ ఓ బుడతడు తన కుటుంబం మీదికి వచ్చిన మాత్రం వచ్చిన వారిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అంతేగాక, వారిని ఓ స్టీల్ రాడ్ చూపిస్తూ బెదిరింపులకు గురిచేశాడు. కాగా, ఆ బుడతడు బెదిరించిందెవరినో కాదు చైనా పోలీసు అధికారులను. బీజింగ్ లో రోడ్డుపక్కన ఉండే తన తల్లిదండ్రుల షాపును బలవంతంగా మూయిండచడానికి వచ్చిన పోలీసులపైకి దూసుకెళ్లాడా బుడతడు.

పక్కనే ఉన్న స్టీల్ రాడ్ పట్టుకుని దగ్గరకు వస్తున్న పోలీసులను దగ్గరికి రావొద్దంటూ బెదిరించాడు. అంతేగాక, తన నానమ్మ మీద చేయి వేయొద్దంటూ హెచ్చరించాడు. వారి ఆగిన తర్వాతే దాన్ని కిందపడేశాడు. తన కుటుంబం కోసం ఆ రెండేళ్ళ కుర్రాడు చూపిన ధైర్యం మామూలుది కాదు. చూడటానికది నవ్వు తెప్పించినా ఆ తెగువ,వాడి కంఠం లో ఆవేషం,కోపం మాత్రం నిజమైనవే. వచ్చిన వాళ్ళు ఏవరో వాడికి తెలియదు,పోలీసు వ్యవస్త అంటే ఏమిటో కూడా తెలియదు కానీ వాళ్ళంతా తనకన్నా పెద్దవాళ్ళనీ తల్చుకుంటే తనను కొట్టగలరనీ మాత్రం తెలిసే ఉంటుంది… కానీ తన కుటుంబం నడిపే హోటల్ ని కూల్చివేయటానికి వచ్చిన అధికారుల కాళ్ళా వేళ్ళా పడుతున్న తన నాయనమ్మ ని వాళ్ళు దురుసుగా పక్కకు వెళ్ళమని ఆదేశించటం వాడికి కోపాన్ని తెప్పించింది… ఎవరూ ఏమిటీ అన్న విశయాలు పక్కన పెట్టి పోరాటానికి సిద్దమయ్యాడు…

ఒక శుభవార్త ఏమిటంటే మనోడి వీరంగానికి ముచ్చటపడ్డ ఆ అధికారులు వాళ్ళ హొటల్ ని కూల్చలేదు. వీడి బాహుబలి వీరంగాన్ని అక్కడే ఉన్న వాళ్ళలో ఒకరు వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టటం తో రెండు రోజుల్లోనే మనోడికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారు. మళ్ళీ మళ్ళీ అదే వీడియోని చూసేస్తూ వీడి చీనా చిన్నోడి వీరత్వాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారట…

(Visited 5,235 times, 8 visits today)