మేగజైన్ కే నిషా ఎక్కించిన ఇషా.

Author:

ఇషా గుప్తా….అందాల ఆరబోత విషయంలో బాలీవుడ్లో ఇప్పుడు ఓ సంచలనం. హాలీవుడ్ స్టార్ ఏంజలీనాజోలీ పోలికతో ఉండే ఈ బ్యూటీ తన సెక్సీ నెస్‌తో సెగలు రేపుతోంది. 30 ఏళ్ల వయసుకు చేరువైనా ఆమెలో అందాల్లో హాట్ నెస్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఆమె సెప్టెంబర్ 2015 ఎడిషన్ మాగ్జిమ్ మేగజైన్ కోసం హాట్ ఫోటో షూట్ ద్వారా తన అందాలతో కుర్రకారుకు నిషా ఎక్కించింది.

మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న ఇషా గుప్తా మిస్ ఫోటోజెనిక్ అవార్డు గెలచుకుంది. బాలీవుడ్ సీరియల్ కిస్సర్ అని పిలుచుకునే ముద్దుల హీరో ఇమ్రాన్ హష్మీ హీరోగా 2012 నిర్మించబడిన “జన్నత్-2” సినిమా ద్వారా బాలివుడ్ లో అడుగు పెట్టిన ఈ భామ. ఇమ్రాన్ హష్మి తోనే వచ్చిన రెండో సినిమా “రాజ్3” ఆమెని బాలీవుడ్ లో నిలబెట్టింది. ఇక ఆతరువాత వరుసగా.. ఉధ్యమ పోరాట నేపథ్య సినిమా చక్రవ్యూహ్ లోనూ నటించినా ఈ సినిమా పెద్దగా ఆడలేదు. 2014 లొ వచ్చిన హం షకల్స్ లో కూడా బబ్లీ గర్ల్ గా కనిపించిన ఇషా గుప్తా 2015 లో సైజ్ జీరో, ఫిర్ హేరాపేరీ-3 లోనూ నటిస్తోంది. తన సెక్సీ ఫిగర్ తో కుర్రాళ్ళ నుంచీ ముసలాల్ల దాకా అందర్నీ ఆకట్టుకుంది. అంతే కాదు మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా దేశం లోనే మోస్ట్ హాటెస్ట్ గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ మధ్య హీరో హృతిక్ రోషన్‌తో ఎఫైర్ ఉన్నట్లు వార్తల్లోకి ఎక్కి మరికొద్దిగా పాపులర్ అయింది. ఈ వార్తల పై ఆమె స్పందిస్తూ…‘నా జీవితంలో హృతిక్‌ని రెండు సార్లు మాత్రమే కలిసాను. తనితో ఎఫైర్ లేదు’ అని స్పష్టం చేసినా పెద్దగా ఎవరూ నమ్మలేదు.

 ఇషా isha gupta

మనిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ నుండి మాస్ కమ్యూనికేషన్లో పట్టా పుచ్చుకున్న ఈ బక్కపలచ బ్యూటీ పుట్టిందీ, పెరిగిందీ రాజధాని డిల్లీ లోనే. చెల్లి నేహగుప్తా కూడా మోడల్ గా ప్రయత్నిస్తోంది.ఆమె తండ్రి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. తల్లి హోమ్ మేకర్. “న్యూకాస్టల్ యూనివర్శిటీ” ఆమెకు లా స్కాలర్ షిప్ స్పానర్ చేసినా.. ఇంట్రస్ట్ లేదంటూ ఆ ఆఫర్ ని దాన్ని కాదనుకుని బాలీవుడ్లో ఎంటరైంది. కింగ్ ఫిషర్ కేలండర్‌తో పాటు ప్రముఖ లీడింగ్ మేగజైన్ల కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఇషా గుప్తా.

(Visited 95 times, 12 visits today)

Comments

comments