EDITION English తెలుగు
ఈ రోజు: 18-10-2018 (గురువారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   ఈ రోజు: 18-10-2018 (గురువారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   సుప్రీం మరోకీలక నిర్ణయం: వెంటనే డైవర్స్ తీసుకోవచ్చు   రెండు వారాల్లోనే హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ…ఐదుగురు మృతి   ఈ రోజు: 17-10-2018 (బుధవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   హాస్పిటల్స్‌లో రోగుల ప‌క్క‌నే ఉంచే హార్ట్ బీట్ మెషిన్‌ను ఏమ‌ని పిలుస్తారో, అందులో రీడింగ్స్‌ను ఎలా చ‌ద‌వాలో తెలుసా..?   ఆరోగ్యం,భోజ‌నం, చ‌దువు, అంతా…..ఈ వాత్స‌ల్యం సంస్థే అండ‌గా నిల‌బ‌డ‌తుది   'తిత్లీ' బాధితులకు సంపూర్ణేష్ బాబు, విజయ్ దేవరకొండ, తారక్‌, కల్యాణ్‌రామ్‌ సాయం   మనుషుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం చివరిసారి చెప్పిన కథ.... తప్పక చదవండి.   కొన్ని యూట్యూబ్‌ చానెళ్లపై గీతామాధురి సీరియస్‌ వార్నింగ్‌

లావెక్కకుండా జాగ్రత్త పడ్డ మహేష్..!

Author:

స్టార్ కోసం డైరెక్టరో ఎంతో చేస్తాడు మరి స్టార్ కూడా డైరెక్టర్ కి ఎంతో కొంత చేయాలి లేదంటే లావైపోతాడు. శ్రీమంతుడు మహేష్ బాబు ఇదే సూత్రాన్ని ఫాలో ఐపోతున్నాడు. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో శ్రీమంతుడు సైలెంట్ గానే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాహుబలి తుఫాన్ లో పెద్దగా హంగామా కనిపించలేదు కానీ శ్రీమంతుడు మామూలు హిట్ ఏమీ కాదు. ఈ సినిమా మామూలు జనం లోనే కాదు సినీ ప్రముఖులలో కూడా మంచి మార్పునే తీసుకొచ్చింది. శ్రీమంతుడు కాన్సెప్ట్ ని ఫాలో ఐపోతూ కొన్ని గ్రామాల అభివృద్ది కోసం దత్తత తీసుకోవటానికి పలువురు సినీ ప్రముఖులూ, రాజకీయ నాయకులూ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే మహేష్ మహబూబ్ నగర్ లోని గ్రామాన్ని దత్తత తీసుకోగా అదే బాటలో తాను కొంత కాలం గా వ్యవసాయం చేయటానికి ఎంచుకున్న గ్రామాన్ని మరింత అభివృద్ది చేయటానికి ముందుకొచ్చారు నటుడు ప్రకాశ్ రాజ్..

ఇదిలా ఉండగా కొంత కాలం గా ఫ్లాప్ లని ఎదుర్కుంటున్న మహేష్ బాబు కి ఈ సినిమా హిట్ కీలక మైన బ్రేక్ తెచ్చింది. దీంతో మళ్ళీ పుంజుకున్నాడు ప్రిన్స్. నంబర్ వన్, ఆగడు వంటి సినిమాలు గత కొంత కాలం గా మహేష్ ని తీవ్ర నిరాశ కు గురి చేసాయి. తాను కథని సరిగ్గ ఎంచుకోలేదనీ ఈసారి మళ్ళీ అలాంటి తప్పు చేయనూ అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించాడు మహేష్. అలాంటి సమయం లోనే వచ్చిన శ్రీమంతుడు మహేష్ కెరీర్ కే ఒక పెద్ద హిట్ ని తెచ్చింది. మరి తనకి ఇంతమంచి బ్రేక్ ఇచ్చిన దర్శకున్ని మర్చిపోతే ఎలా..!? అందుకే తాను లావైపోకుండా ఉండేందుకు తనకు ఎంతో కొంత డైరెక్టర్ కోసం తానూ ఏదైనా చేయాలనుకున్నాడట. అందుకే అత్యంత ఖరీదైన ఆడీ-6 సిరీస్ కారుని కొరటాల శివకి ప్రెజెంట్ చేసాడట.

ఉన్నట్టుండీ వెంటనే జూబ్లిహిల్స్ ఆడీ షోరూం దగ్గరికి రమ్మని మహేష్ నుండి కాల్ రావటం తో అక్కడికి వెళ్ళిన కొరటాల కి కార్ తాళాలిచ్చి సర్ప్రైజ్ చేసాడట మహేష్ బాబు. దాంతో శివ ఎంతో సంతోష పడ్డాడట. మహేష్ లో ఉండే ఈ మంచి మనసు గురించి వినే ఉన్న ఆయన అభిమానులు మహేష్ చేసిన ఈ పనికి తాము కూడా ఆనందం గనే ఈ వ్యవహారాన్ని అందరికీ చెప్పుకుంటున్నారు. నిజమే తమ కి సక్సెస్ ఇచ్చిన వారిని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇదే విషయాన్ని ప్రాక్టికల్ గా చెప్పిన మహేష్ మనసులో నిజంగా శ్రీమంతుడే అనిపిస్తోందీ కదా….! హ్యాట్సాఫ్ ప్రిన్స్ మహేష్..

(Visited 59 times, 19 visits today)