దత్తత గ్రామంలో స్కూల్ కట్టిస్తున్న మహేష్ బాబు..!

Author:

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తీసిన శ్రీమంతుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పక్కర్లేదు, ఆ సినిమా ఒక ఊరిని దత్తత తీసుకోని బాగుచేయటం అనే కాన్సెప్ట్ తో వచ్చింది, ఆ సినిమా విడుదల అయిన తరువాత మన తెలుగు రాష్ట్రాల్లో అనేకమంది సెలెబ్రెటీలు, రాజకీయ నాయకులూ గ్రామాలని దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారు, మహేష్ బాబు కూడా ఆంధ్ర ప్రదేశ్ లో తన సొంతూరు అయిన బుర్రిపాలెంని, తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా సిద్దాపురంని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.

సిద్దాపురం

దత్తత అంటే అందరిలాగా ఒక ప్రోగ్రామ్ చేసి ఫోటోలు దిగడంలా కాకుండా ఆ గ్రామాలలో ఒక ప్రణాళిక ప్రకారం మహేష్ బాబు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుతున్నారు, తెలంగాణలోని సిద్దాపురంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబందించిన ఫోటోలని స్వయంగా మహేష్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు, ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది, మహేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా శ్రీమంతుడే అని నెటిజన్ట్లు పొగుడుతున్నారు.

Our new school building in Siddhapuram 🙂 Construction in progress ??looking forward to its completion 🙂 Thanks to our architect Sudhir Reddy and his team for such amazing work ?

Posted by Mahesh Babu on Thursday, 11 January 2018

(Visited 78 times, 96 visits today)