EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / General / లైకుల కోసం కన్న కొడుకునే చంపేయబోయాడు.

లైకుల కోసం కన్న కొడుకునే చంపేయబోయాడు.

Author:

ఫేస్ బుక్ పిచ్చి ఎక్కువ అయితే ఎలా ఉంటుoదో తెలుసా.. ఫేస్ బుక్ లో తాను పెట్టిన పోస్టుల లైకుల కోసం ఒకతను ఏకంగా కన్న కొడుకునే చంపేయబోయాడు. వినడానికి విడ్డూరంగా, మరెంతో ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. లైకుల పిచ్చికి పరాకాష్టగా నిలిచిన ఈ వార్త వింటే ఎవరికైనా ఆవేదనతో కూడిన ఆవేశం తన్నుకురాక తప్పదు. ఒక తండ్రికి ఫేస్ బుక్ లైకుల పిచ్చి పట్టుకుంది. దాంతో కన్నా కొడుకుని 15 వ అంతస్తు నుంచి పడేయబోతున్నట్టుగా ఫోటో తీసి మరీ పెట్టాడు. కనీసం వెయ్యి (1000) లైకులు రాకపోతే నిజంగానే కొడుకుని 15 వ అంతస్తు నుంచి కిందకు విసిరి చంపేస్తా అని రాసి ఫోటో పోస్ట్ చేసాడు.

father dangles toddler from tower for Facebook likes

అయితే నెటిజన్లు మరీ అంత మూర్ఖంగా లేరు కదా.. అందుకే లైకులు కాదు కానీ, ఆ తండ్రి నిర్వాకం పట్ల అంతా విరుచుకు పడ్డారు. కనీసం ఇంగితం కూడా లేదా అని తిట్టి పోస్తూ కామెంట్లతో ఎదురు దాడి చేసారు. ఫేస్ బుక్ యూజర్లు ఒక రకంగా మనోడి పై దాడి చేసినంత పని చేశారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే రంగం లోకి దిగి ఆ తండ్రిని అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరచగా, సదరు తండ్రి చేసిన పిచ్చి పనికి గానూ కోర్టు అతనికి రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. లైకుల కోసం కన్నా కొడుకుని చంపాలనుకోవటం ఏంటో పిచ్చి జనాలు కాకపోతే…

ఇలాంటి ఫేస్ బుక్ లైకుల పిచ్చి అనేది అందరిలో తమకు గుర్తింపు రావాలనే పిచ్చి లోంచే వస్తుందని నిపుణులు, మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తమ చుట్టూ ఉన్నవారితో సరదాగా గడపడం వల్ల ఈ గుర్తింపు పిచ్చి, లైకుల పిచ్చి నుంచి బయటపడొచ్చు అని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.

Comments

comments