Home / Political / Video: పాముతో ఫోటో దిగాలన్న సరదా అతని ప్రాణం తీసింది.

Video: పాముతో ఫోటో దిగాలన్న సరదా అతని ప్రాణం తీసింది.

Author:

సరదా కోసం చేసే కొన్ని పనులు మనుషుల ప్రాణాల మీదకు వచ్చిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఫోటోల కోసం, సెల్ఫీల కోసం వింత వింత పనులు చేసి కొందరు మృత్యువాత చెందారని రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం అలాంటి సంఘటనే ఒకటి రాజస్తాన్ లోని జోధ్ పూర్ లో జరిగింది. పాములు పట్టుకుని ఆడించే వాడి దగ్గర ఉన్న పాముతో ఫోటో దిగాలని సరదా పడిన ఓ వ్యక్తి ఆ పాము కాటుకే మరణించాడు. ఆ వ్యక్తి ఫోటో దిగినప్పటి వీడియోను ఇక్కడ చూడండి.

పాముతో ఫోటో దిగాలనుకున్న వ్యక్తి మీదకు పాములు ఆడించే వ్యక్తి పామును తీసుకురాగానే అది ఫోటో దిగాలనుకున్న వ్యక్తి చెంపపై కాటు వేసింది కాని అది గమనించకుండా ఆ వ్యక్తి ఫోటో దిగడంలోనే నిమగ్నం అయ్యి ఉన్నాడు, కొంతసేపటికి ఎదో కరిచిందన్న అనుమానం వ్యక్తం చేసినా పాములు పట్టే వ్యక్తి అతన్ని పట్టించుకోలేదు, దానితో సృహ కోల్పోయిన అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి బదులు నాటువైద్యం చేసే మంత్రగాడి దగ్గరికి తీసుకు వెళ్ళారు. దానితో ఆ వ్యక్తి అక్కడే మరణించాడు పాముతో ఫోటో దిగాలనే సరదా అతని ప్రాణాలనే హరించింది.

(Visited 2,782 times, 18 visits today)