EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

నీకు ఎన్ని గుండెలురా అంటారేమో…. ఆయనకి రెండు గుండెలు మరి.

Author:

నారాజ్యం లోకి అడుగు పెట్టడానికి నీకు ఎన్ని గుండెలురా… చాలా సినిమాల్లో మనకి బాగా పరిచయం ఉన్న డైలాగ్ ఇది. అలా అన్నంత మాత్రాన నిజంగా ఒకటి కన్నా ఎక్కువ గుండెలు ఉన్నాయి అని కాదు. అసలు నీకు ఎంత ధైర్యం అనే దానికి ఇలాంటి డైలాగ్స్ వాడుతాం. ఈ డైలాగ్స్ అన్ని సినిమా వంతు అయితే మరి నిజ జీవితంలో అలాంటి పరిస్థితే వస్తే… నిజంగానే ఒకటి కన్నా ఎక్కువ గుండెలు ఉన్న మనిషే మనకు తారస పడితే దీని కన్నా అద్భుతం ఇంకేం ఉంటుంది. మరి మన డాక్టర్ దేవుళ్ళు మనిషిని బతికించటమే కాదు ఎంతో విజ్ఞానంతో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. మరి అలాంటి ఒక సంఘటనే జరిగింది కోయంబత్తూర్ లోని కోవై మెడికల్ సెంటర్ అండ్ హాస్పిటల్ లో. ఇది అద్భుతం కాకపోతే ఇంకేంటండి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

man with Two hearts in india
45 ఏళ్ల సురేష్ అనే వ్యక్తి 10% మాత్రమే పనిచేస్తున్న గుండె తో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. కానీ అతడి ఊపిరితిత్తులు వేగంగా పనిచేయటంతో ఒక గుండె ని అమర్చటంతో ఆపరేషన్ అయిపోలేదు. ఒక మహిళ దానం చేసిన గుండెని సురేష్ చెస్ట్ కావిటీలో అమర్చారు. 10% పనిచేస్తున్న సురేష్ గుండె తో పాటుగా ఈ కొత్త గుండె సమానంగా పని చేసేలాగా అమర్చారు. ఇప్పుడు అతడి గుండెలు సమంగా కొట్టుకుంటుంటే చూడడం ఒక అద్భుతమే. ఇలాంటి ఒక ఆపరేషన్ జరగటం మన ఆసియా ఖండం లోనే మొదటిది. డాక్టర్స్ బృందం మాట్లాడుతూ ఈ ఆపరేషన్ చాల కష్టమే అయినా అతడి శరీరం ఈ ఆపరేషన్ కి సహకరించింది అని చెప్పారు.

డాక్టర్ ప్రశాంత్ విజయనాథ్ మాట్లాడుతూ ఇలాంటి ఆపరేషన్ జరగటం మన ఆసియా లో మొదటిది. ఒక మహిళ గుండె, అది కూడా చిన్నది గా ఉండటం, అతడికి కరెక్ట్ గా ఫిట్ అవటం, దానికి తోడు అంతకు ముందే ఉన్న గుండె తో ఈ కొత్త గుండె సమంగా పనిచేయటం అతడి అదృష్టం. గుండెలు రెండు పక్క పక్కనే ఉన్నా ఒకటిగా పని చేసే లాగా కనెక్షన్స్ ఇచ్చారు డాక్టర్స్. ఈ సర్జరీ చాల కష్టపూరితమే అయినా పేషెంట్ గుండె పనితీరు సంతోషాన్ని ఇస్తుంది. ఈ ఆపరేషన్ జన్యు పరంగా కూడా ఒక అద్భుతమే… ఎందుకంటే ఆడవారిలో ఉండే xx క్రామోసోములు, మగవారిలో ఉండే xy క్రామోసోములు కలిసి ఒక అవయవంగా పనిచేయటం. ఈ రెండు గుండెలకి 5 కనెక్షన్స్ ఉంటాయి. రెండు కనెక్షన్ లు మంచి రక్తాన్ని సరఫరా చేస్తే, మిగతా మూడు చేదు రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఈ గుండెలని ఇలా అనుసంధానం చేయడం మాకు పెద్ద సవాలుగా నిలిచింది. కానీ, రెండు గుండెలు ఒకటిగా పనిచేయటం మా కష్టానికి ఫలితంగా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.

(Visited 442 times, 39 visits today)

Comments

comments