యాక్టింగ్ కి గుడ్ బై చెప్పనున్న మంచు మనోజ్?

Author:

మోహన్ బాబు తనయుడు, నటుడు మంచు మనోజ్ ఇక నటించడం మానేయనున్నాడు. కారణాలేవీ తెలియనప్పటికీ యాక్టింగ్ కి మాత్రం గుడ్ బై చెప్పనున్నట్టు ట్వీట్ చేసి అందరినీ షాక్ కి గురి చేశాడు. ఒక్కడు మిగిలాడు.. ఆ తరువాత మరో సినిమా.. ఇవే నా ఆఖరి సినిమాలు. యాక్టింగ్ కు స్వస్తి పలుకుతున్నాను. థ్యాంక్యూ అంటూ ట్వీట్ చేశాడు. మరి మనోడికి ప్రాక్టికల్ జోక్స్ అలవాటే కాబట్టి సరదాగా జోక్ చేశాడా? లేక నిజంగానే యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టనున్నాడా ? ఏమో చెప్పలేం.

Manchu Manoj Shocking Statement about his career

ఇప్పుడు ఆల్రెడీ మనోజ్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఎల్టీటీఈ నేపథ్యంలో నిర్మించిన ఒక్కడు మిగిలాడు అనే సినిమాతో పాటూ మరో సినిమా కూడా లైన్లో ఉంది. ఒక్కడు మిగిలాడు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధంగా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో తాను ఇక నటనకు బై బై అని ట్వీటు చేయడం నిజంగా షాకింగ్.

తను పెట్టిన పోస్ట్ వైరల్ అవ్వడంతో మంచు మనోజ్ స్పందించాడు. వినూత్నంగా ఆలోచించి తాను చేయబోయే సినిమా గురించి ప్రకటిద్దామని ఇలా పోస్ట్ పెట్టానని కాని దానికి ఇంత అనూహ్య స్పందన వస్తుందని అనుకోలేదు అని ఇప్పుడే ఇంకో పోస్ట్ పెట్టాడు. నేనే ఎదో చేదామనుకుంటే ఇంకేదో అయ్యి నా పోస్ట్ చాలా మంది చాలా రకాలుగా అర్ధం చేసుకుంటున్నారని, ఈ వేడి చల్లారాకా తన కొత్త సినిమా గురించి చెప్తానటూ పోస్ట్ పెట్టాడు.. సో సినిమాల నుండి మంచు మనోజ్ తప్పుకోవట్లేదు.

(Visited 1,807 times, 48 visits today)