EDITION English తెలుగు
ధోని భార్యపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్న ఫాన్స్..! పర్సనల్ విషయాలను పబ్లిక్ చేయొద్దు.?   మెట్రోలో ఎదురుగా ఉన్న అమ్మాయి దిగేటప్పుడు ఏమనిందో తెలుసా.? దెబ్బకు ట్రైన్లో అందరు షాక్!   ఈరోజే ముక్కోటి ఏకాదశి..! ప్రతి ఒక్కరు ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం, అందరికి తెలియజేయండి.   "మనోజ్ అన్నా నువ్వు కూడా ఆ ముగ్గురిలా ఏదైనా వదులు" అంటే మనోజ్ ఇచ్చిన కౌంటర్ హైలైట్!   వివాదంగా మారిన కేసీఆర్ ఫ్లెక్సీ..పెట్టినవెంటనే తొలగించారు..! ఎందుకో తెలుసా.?   ఏడాది పాటు స్మార్ట్ ఫోన్ వాడకుండా ఫీచర్ ఫోన్‌ వాడితే రూ.72 లక్షలు మీవే.! ఎలా పొందాలంటే.?   తెరాస కు ఆంధ్రాలో నిజంగానే ఫాలోయింగ్ ఉందా.? ఆంధ్ర రాజకీయాల్లో నిజంగానే అడుగుపెడతారా.?   "నా పేరు శివ. నేను చేసిన పనే మీరు చేస్తే తిప్పలు తప్పవు" అంటూ ఒకరు పంపిన మెసేజ్ ఇది!   లిటిల్ సోల్జర్స్ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.? ఆమె బాక్గ్రౌండ్ ఇదే.!   ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని అతను ఏం చేసాడో తెలుసా.? కరెక్ట్ అంటారా.?
Home / Latest Alajadi / ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ కన్నుమూత.

ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ కన్నుమూత.

Author:

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ(86) చెన్నైలోని తన నివాసంలో మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కచేరీలు చేసి ఎన్నో అవార్డులు రివార్డులతోపాటు డాక్టరేట్లను, ప్రపంచ స్థాయిలో బెనిలియర్ అనే అత్యుత్తమ పురస్కారాన్ని అందుకున్న మంగళంపల్లికి భారతప్రభుత్వం పద్మభూషణ్,పద్మ విభూషణ్, పద్మశ్రీ పురస్కారంలతో సత్కరించింది….. భక్తప్రహ్లాద సినిమాలో నారదుడిగా, సందెని సింధూరం అనే మలయాళం సినిమాలో నటించాడు. పలు చిత్రాలకు ఆయన సంగీతాన్ని అందించారు. 1930జులై  6 వ తేదీన తూర్పుగోదవరి జిల్లా శంకరగుప్తంలో పట్టాభిరామయ్య, సూర్యకాంతం దంపతులకు జన్మించిన మంగళంపల్లి ఆరేళ్ళ వయసులోనే గాయకుడిగా సంగీత ప్రస్థానం ప్రారంబించాడు. మొదటి గురువు వారి తండ్రే కావడం విశేషం. సంగీతంతో పాటు మృదంగం, మురళి, వీణ,వయోలిన్ వంటి వాటిలో మంచి పట్టుసాధించారు. చాలా రోజుల పాటు తితిదే,శృంగేరి పీఠాల ఆస్థాన విద్వంసుడిగా పనిచేశారు. చాలా సినిమాలలో పాటలు పాడారు, భక్త ప్రహ్లాద సినిమాలో నారదునిగా, మరికొన్ని సినిమాలలో నటించారు. అయన ఎన్నో అవార్డులతో విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు.

mangalampalli-balamuralikrishna

గత కొంత కాలంగా తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చాలా రోజులపాటు చెన్నైలోని ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది కొద్దీ రోజుల క్రితమే ఇంటికి వచ్చారు . ఇంటికి వచ్చిన కొద్దీ రోజులకే ఆరోగ్యం విషమించింది. చెన్నైలోని తన అకాడమీలో కుటుంబ సభ్యులతో పాటు శిష్యులు కూడా సేవ చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన తుది శ్వాస విడిచారు.

(Visited 591 times, 61 visits today)