EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

ఎక్కడిక్కడ ఆరెస్ట్లు చేసినా….విజయం కోదండరాం దే..!

Author:

తెలంగాణ వచ్చి మూడేళ్లు కావొస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన లక్ష ఉద్యోగాల కల్పన హామీని తెలంగాణ ప్రభుత్వం విస్మరించింది అని నిరుద్యోగ సమస్యని వెంటనే పరిష్కరించాలని తెలంగాణ జేఏసీ ఈరోజు ఇందిర పార్క్ దగ్గర నిరసనకి పిలుపునిచ్చింది, ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపుకి రాష్ట్ర వ్యాప్తంగా యువత మద్దతునిచ్చారు. ఈ నిరసనకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఉదయం నుండే పోలీసులు ఉక్కుపాదం మోపారు, ఉదయం ౩ గంటలకే ఇంటి తలుపులు బద్ధలు కొట్టి మరీ ఉద్యమ నేత అయిన కోదండరాంని అరెస్ట్ చేసారు, కోదండరాంతో పాటు మరో ౩౦ మంది జేఏసీ నేతలని, విద్యార్థి సంఘాల నాయకులని ఉదయాన్నే అరెస్ట్ చేయడంతో తెలంగాణలో నిర్వహించాలని భావించిన నిరుద్యోగుల నిరసన ర్యాలీ ఎలా జరుగుతుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే.. సందేహాల్ని పటాపంచలు చేస్తూ హైదరాబాద్ లోని విద్యార్థులు నిరసన కదం తొక్కారు. ఎక్కడికక్కడ నిరసన ర్యాలీని నిర్వహించేందుకు విపరీతంగా ప్రయత్నించారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమ కేంద్రంగా నిలిచినా ఉస్మానియా క్యాంపస్ మరోసారి రణరంగమైంది, ఆర్ట్స్ కాలేజీ నుండి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులని క్యాంపస్ నుండి బయటకు రానీయకుండా పోలీసులు ఉక్కుపాదం మోపారు, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్న విద్యార్థుల పట్ల తెలంగాణ పోలీసులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. విద్యార్థులని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీసుస్టేషన్ తరలించారు.

Tension-situation-at-Osmania-University-During-Unemployement-Rally

పోలీసులు ఎక్కడిక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విద్యార్థులని నగరంలోకి రాకుండా అడ్డుకున్నారు, ఉద్యమకారులు సికింద్రాబాద్.. బాగ్ లింగంపల్లి.. కామటిపురా.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్.. ఎల్ బీ నగర్..నిజాం కాలేజీ తదితర ప్రాంతాల్లో నిరసన ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక.. నిరసన ర్యాలీని నిర్వహించాలని భావించిన ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్దకు ఆందోళనకారులు ఏ మాత్రం వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇక్కడి భద్రత కోసం ఏకంగా ఐదుగురు ఏసీపీలు.. 20 మంది సీఐలు.. 200 మంది పోలీసుల్ని నియమించారు.

కోందండరాం ఇచ్చిన పిలుపుకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల నుండి, ఉద్యమకారుల నుండి ఈ స్థాయిలో స్పందన వస్తుందని పోలీసులు, ప్రభుత్వ వర్గాలు ఉహించలేకపోయాయి, నిరసనకారులని అదుపు చేయడానికి పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది, పోలీసులు విపరీతంగా శ్రమించి ఇందిర పార్క్ దగ్గరికి ఎవరు రాకుండా అడ్డుకున్నారు, ఉద్యమం జరగకుండా చేయటంలో పోలీసులు విజయం సాధించినప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులని ఏకం చేయటంలో, ఉద్యమనేత అయిన కెసిఆర్ గారికే టెన్షన్ తెప్పించడంలో కోదండరాం నైతిక విజయం సాధించారు, ఈ నిరసనలో వెల్లడైన వ్యతిరేకతని చూసి అయిన తెలంగాణ ప్రభుత్వం మేల్కోనకపోతే భవిష్యత్ లో మరిన్ని ప్రజా ఉద్యమాలకి వచ్చే ఆవకాశం ఉంది.

(Visited 99 times, 33 visits today)

Comments

comments