Home / Inspiring Stories / టెన్నిస్ లో చరిత్ర సృష్టిస్తున్న సానియా- హింగిస్‌ ల జోడి.

టెన్నిస్ లో చరిత్ర సృష్టిస్తున్న సానియా- హింగిస్‌ ల జోడి.

Author:

sania-mirza-martina-hingis-trophy

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సానియా- హింగిస్‌ ల జోడి మరో చరిత్ర సృష్టించింది.ఈ జోడి తమ ఖాతాలో మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను వేసుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో సానియా-హింగిస్ జోడి 7-6, 6-3 స్కోర్‌తో చెక్‌రిపబ్లిక్‌కు చెందిన హవకోవా-హడేకా జంటపై గెలుపొందారు. సానియా-హింగిస్ జోడికి ఇది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం.ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్ ల జోడీ బ్రేక్ లేకుండా వరుసగా 36వ మ్యాచ్‌ను గెలుపొందింది. ఫైనల్లో తొలి సెట్ కాస్తంత టైట్‌గానే సాగినా, రెండవ సెట్‌లో సానియా-హింగిస్ ల ధాటికి ప్రత్యర్థులు చేతులెత్తేశారు. 36 మ్యాచ్‌ల్లో వరుసగా 6వ గ్రాండ్ స్లామ్‌ను ఈ జోడీ గెలుచుకుంది. తాజా విజయంతో ఈ జోడీ క్యాలెండర్ గ్రాండ్ స్లామ్‌కు చేరువలో ఉంది. మ్యాచ్ అనంతరం ట్రోఫీని అందుకున్న మార్టినా హింగిస్ మాట్లాడుతూ ‘థాంక్ యూ సానియా అసలు నువ్వు లేకుండా నేనిక్కడ లేను, మనిద్దరం ఈ టోర్నమెంట్‌లో ఎంతగానో శ్రమించాం, వచ్చే ఏడాది కూడా టైటిల్ నిలబెట్టుకుంటాం’ అని వ్యాఖ్యానించారు… దానికి ‘నా పార్టనర్ మార్టినా హింగిస్‌కు థ్యాంక్స్. మా ఇద్దరి జోడీకి ఈ ఏడాది ఎంతగానో కలిసొచ్చింది. తనతో కలిసి ఆడటం నాకెంతో గర్వంగా ఉంది. మార్టినా ఓ అద్భుతమైన వ్యక్తి” అంటూ హుందాగా సమాధానం చెప్పింది. సానియా…

ఇప్పటివరకూ వరుసగా వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లను గెలిచిన సానియా జోడి ఇక ఫ్రెంచ్ ఓపెన్‌ను కూడా ఖాతాలో వేసుకుంటే గ్రాండ్‌స్లామ్‌లో క్లీన్‌స్వీప్ కొట్టేస్తారు.ఇప్పటికే సానియా- హింగిస్‌ ల జోడి వరుసగా 36 మ్యాచ్ లు గెలిచి రికార్డు సృష్టించారు, ముందు ముందు మరిన్ని రికార్డులు సృష్టించాలని కోరుకుందాం.

(Visited 123 times, 14 visits today)