Home / Entertainment / బెంగాల్ టైగర్ గా వచ్చిన తెలుగోడు…!

బెంగాల్ టైగర్ గా వచ్చిన తెలుగోడు…!


నేను క్లైమేట్ లాంటోన్ని అప్పుడప్పుడు సల్లగా ఉంటా అప్పుడప్పుడూ వెచ్చగా ఉంటా అప్పుడప్పుడూ వణికిస్తా” అద్దిరిపోయే డైలాగ్ ఇంకా అదిరి పోయే డెలివరీ.. కింగ్ ఆఫ్ మాస్ రవితేజా కొత్త సినిమా బెంగాల్ టైగర్ లో డైలాగ్ ఇది.

“ఊహలు గుస గుసలాడే” రాశీ ఖన్నా,మిల్కీ బ్యూటీ తమన్నాలతో రవితేజ తెర పై రొమాన్స్ చేయనున్నారు. సంపత్ నంది దర్శకత్వం లో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక బెంగాల్ టైగర్ ఆడియో ప్రేక్షకుల ముందుకు ఈ నెల 18న రానుంది.నిర్మాత రాధా మోహన్.గత కొంతకాలం గా సూపర్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న రవితేజా కి బంపర్ హిట్ అందించే సినిమా బెంగాల్ టైగర్ అంటున్నారు యూనిట్ సభ్యులు…

ఈ సినిమా టీజర్ ని కొద్ది సేపటి క్రితమే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. మంచి ఎనెర్జిటిక్ డైలాగ్ తోనూ,యాక్షన్ సన్ని వేశాలతోనూ కట్ చేసిన ఈ టీజర్. మాస్ ఆడియెన్స్ ని దృష్టిలో పెట్టుకొనే చేసినట్టు గా ఉంది. తన స్టైల్ ఆఫ్ యాక్షన్ తో ప్రేక్షకులని అలరించే విధంగా రూపొందిన సినిమా అని ంచెప్పొచ్చు. రవితేజా గతం లోకన్నా యంగ్ గా ఉన్నారు. మంచి బీట్ తో ఉన్న హీరో ఇంట్రడక్షన్ సాంగ్ సన్ని వేశాలనూ యాక్షన్ నూ కలిపి కట్ చేసిన ఈ టీజర్ లో హీరోయిన్ గ్లామరస్ సీన్లు మాత్రం రెండే ఉనాయి….. ఐతే ఆ రెండు సెకెన్ల సీన్ కూడా ప్రేక్షకున్ని థియేటర్ వైపు లాకొచ్చేంత మసాల తోనే ఉంది…

మాస్ ని మెప్పించే దర్శకుడుడు సంప‌త్ నంది అనుకున్న దానికంటే అద్భుతంగా తెరకెక్కించినట్టే అనేది స్పష్టమౌతోంది. హీరో ర‌వితేజ‌, బ్ర‌హ్మ‌నందం గారి కాంబినేష‌న్ వ‌చ్చే ప్ర‌తి సన్నివేశం ఎంట‌ర్‌టైన్ చేస్తాయట. గెస్ట్ పాత్ర‌ల్లో హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రానే, అక్ష న‌టిస్తున్నారు. బోమ‌న్ ఇరానితో పాటు రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, ప్ర‌భు, ప్ర‌గ‌తి, నాగినీడు, ప్ర‌భ‌, ర‌మాప్ర‌భ తదిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు…

(Visited 38 times, 20 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]