EDITION English తెలుగు
స్కూల్ కి రావట్లేదని అడిగినందుకు.. ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన స్టూడెంట్.   షాకింగ్ న్యూస్: మూతపడిన ట్రంప్ ప్రభుత్వం, సంక్షోభంలో అమెరికా...!   Video: మెట్రో నుంచి రోడ్ మీద వెళ్తున్న కారులో దిగబడిన రాడ్.   క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారి.. సాయం అందించాలనుకునే వారు అకౌంట్ నం. 80808080101026419 లో డబ్బులు వేయండి.   డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!   Video:స్కూల్ కి పది నిముషాలు లేట్ గా వచ్చాడని.. బాతులా నడిపించి..బలి తీసుకున్నారు.   పెద్ద పెద్ద క్రేన్లు ఆ హనుమాన్ విగ్రహాన్ని ఇంచుకూడా కదలించలేక పోయాయి.   బంపర్ ఆఫర్: కేవలం రూ.99 కే విమానం టిక్కెట్   ఆమె భర్త ఏది కావాలంటే తెచ్చిచ్చేవాడు, ప్రేమగా చూసుకునేవాడు..! అయిన ఆ భార్య విడాకులు కోరింది, ఎందుకో తెలుసా..?   టెన్త్ విద్యార్హతతో డిగ్రీ చేయాలనుకుంటున్నారా..? అయితే ఇదే మంచి అవకాశం..!
Home / Political / ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల పరీక్షలు, మందులు ఉచితమే…!

ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల పరీక్షలు, మందులు ఉచితమే…!

Author:

ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం చేయించుకోవాలనుకుంటే భయపడే పరిస్థితి వచ్చింది, ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకి సరైన వైద్యం అందట్లేదు, ఈ పరిస్థితిని మార్చి ప్రజలకి మెరుగైన వైద్యం అందించేందుకు తెలంగాణ వైద్య శాఖా మంత్రి అధికారులకు కొన్ని సూచనలు చేసారు, ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు ఉచితంగా మందులని పంపిణీ చేయాలనీ, రోగ నిర్ధారణ పరీక్షలన్నీ ఉచితంగా అందించేందుకు అవసరమైన బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు వైద్యఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆపరేషన్ థియేటర్ లని ఆధునీకరించి, అన్ని సౌకర్యాలని పెంచాలని , అన్ని రకాల రోగాలకి ప్రభుత్వ ఆసుపత్రులలోనే వైద్యం అందేలా సౌకర్యాలు ఉండేలా చేస్తాం అని ప్రకటించారు.

medicines free in all government hospitals

2017-18 బడ్జెట్‌ అంచనాలపై సమీక్ష సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

  • వచ్చే ఏప్రిల్‌ నుంచి అన్నిరకాల మందులూ పంపిణీ
  • రోగ నిర్ధారణ కేంద్రాలకు అవసరమైన వైద్యపరికరాలు అందేలా ఏర్పాట్లు
  • మాతాశిశు సంరక్షణలో భాగంగా కొత్తగా జన్మించిన పిల్లల కోసం కిట్లు
  • ప్రభుత్వాసుపత్రులలో ప్రసూతుల కోసం ఎక్కువ మందిని చేర్చేందుకు వీలుగా ప్రత్యేక ప్రోత్సాహకాలు
  • కొత్త జిల్లాకేంద్రాల్లో పెద్దాసుపత్రుల ఏర్పాటు
  • ప్రస్తుతం వాటిల్లో ఏరియా ఆసుపత్రులుంటే వాటిస్థాయిని పెంచుతారు.
  • కొత్త భవనాలు అవసరమైతే వాటి నిర్మాణాలకు నిధులు కేటాయింపు
  • 108 అత్యవసర వాహనాలు మరిన్ని కొనుగోలు
  • మృతదేహాలను తరలించే వాహనాల సంఖ్య మరింత పెంపు

Comments

comments