Home / Inspiring Stories / మీరు తాగేది మంచినీరేనా..?

మీరు తాగేది మంచినీరేనా..?

Author:

Mineral water in hyderabad

“జలమే జీవం” భూమిలోనే కాదు మానవదేహం లోనూ మూడువంతులు నీరే ఉంటుంది. ఒక్కో చుక్కా మన శరీరం లోకి ఖనిజ లవణాలనీ పోషకాలనీ తీసుకు వెళుతుంది కానీ ఆ నీరే ప్రాణాలని హరించే విషం లా మారితే?? జీవం నింపాల్సిన అమృతమే విషంగా మరితే..!!? నల్లా నీళ్ళలో కలుషితాలుంటాయి ఆరోగ్యం తో ఆటలెందుకు? సీసా నీళ్ళు మంచివి… బొట్టు బొట్టులో విశ్వాసం అంటూ “కార్పోరేట్ మంచి నీళ్ళని” అమ్ముకునే సంస్ఠలు నిబందనలని తుంగలో తొక్కుతున్నాయి.అసలు మామూలు నీళ్ళకంటే ప్రమాదకర బ్యాక్టీరియాలని మనలోకి పంపిస్తున్నాయి…

ఈ-కొలి బ్యాక్టీరియా,కొలి ఫాం ఈ రెండూ  టైఫాయిడ్, కామెర్లు, అతిసార వ్యాధుల కారకాలు,ఎక్కువగా మలం లోనూ,పందులు ఎక్కువగా తిరిగే మురికి గునటలలోనూ ఉండే బ్యాక్టీరియా ఇది. ఎప్పుడూ తడి గా ఉండే వాటర్ ప్లాంట్ లలో ఈ బ్యాక్టీరియా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి.ఓ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే కనీసం పాతిక లక్షలు ఖర్చవుతుంది. దాంతో పాటు, ఐఎస్ఓ తో పాటు ఇతర పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది. చాలావరకు ప్లాంట్లు ఇవేవి పాటించడం లేదు. ఎలాంటి పర్మిషన్ లేకుండా కేవలం 3, 4 లక్షలతో అక్రమంగా ప్లాంట్ వేసేస్తున్నారు. వీటిపై అధికారుల వద్ద ఎలాంటి సమాచారం ఉండదు. ఐఎస్ఐ సర్టిఫికేట్ పొందిన మినరల్ వాటర్ ప్లాంట్లపై అధికారులు రెండు నెలలకోసారి తనిఖీలు నిర్వహిస్తారు. ఐతే అసలు ప్లాంట్ రిజిస్టరే అవక పోతే..!?అక్రమ మినరల్ వాటర్ తయారీదారులు అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. బస్టాండ్ లూ సినిమా హాళ్ళూ, టూరిస్టు ప్రదేశాల్లోనూ పెద్ద కంపెనీల బ్రాండెడ్ లుక్ తో సీసాలు అమ్ముతున్నారు. ఒక్క దానికీ సరైన గుర్తింపు ఉండదు.20 లీటర్ల మినరల్ వాటర్ కు వారికయ్యే ఖర్చు 3 రూపాయలు కాగా 30 రూపాయలకు అమ్ముతున్నారు. అదే ఐఎస్ఐ మార్కు పొందిన 20 లీటర్ల మినరల్ వాటర్ ఖరీదు 45 రూపాయలు. బ్రాండెడ్‌ కంపెనీలవైతే 65 నుంచి 80 రూపాయల వరకు ధర ఉంటోంది..

మినరల్‌ వాటర్‌ పేరుతో ప్యాకేజ్డ్ వాటర్‌ తయారు చేస్తున్న పలు కంపెనీలు స్థానికంగా లభించే బోరు నీళ్లను తీసుకుని శుద్ధి చేస్తాయి. తరవాత అల్ట్రా వయొలెట్‌, ఓజోనైజేషన్‌ ప్రక్రియల ద్వారా సూక్ష్మ క్రిముల రహితంగా మారుస్తారు. ఇవన్నీ చేసేందుకు అయా కంపెనీలకు ప్యాకెట్స్ పై ముద్రించిన ధరలో నాల్గవ వంతు మాత్రమే ఖర్చువుతుంది. ఇది స్వచ్ఛమైన నీరు అని ఆయా కంపెనీలు ప్రకటించుకోవడం తప్ప ఎలాంటి భరోసా ఉండదు. పైగా వాటి సీలు తీయగానే గాల్లోని సూక్ష్మక్రిములు వాటిలోకి ప్రవేశిస్తాయి. ఈ నీటిని తాగిన వారికి వాంతులు, విరోచనాలు అవుతాయి. కలుషిత నీటి వల్ల పచ్చకామెర్లు, కడుపు, గొంతు ఇన్ ఫెక్షన్ లాంటి వ్యాధులు సంక్రమిస్తాయి. ప్యాకేజ్డ్ డ్రింకింగ్‌ వాటర్‌ను ఏదైనా బ్రాండ్‌ పేరుతో సరఫరా చేస్తే అది ఆహార కల్తీ చట్టం పరిధిలోకి వస్తుంది. నీటిని విక్రయించే సంస్థలు విధిగా భారత ప్రమాణాల సంస్థలోని 145,43 సెక్షన్‌ కింద రిజిస్టర్‌ కావలసి ఉంటుంది. హైదరాబాద్ పరిధిలోని 80 శాతం వాటర్ ప్లాంట్లలో బాక్టీరియా ఆనవాళ్లున్నట్లు ఓ ప్రయివేట్ లాబరేటరీలో జరిపిన పరిశోధనల్లో తేలింది.
Water Packets

ప్రతి లీటరు నీటిలో క్యాల్షియం మోతాదు 75 మిల్లీ గ్రాములుండాలి,ప్రతి లీటరు నీటిలో మెగ్నీషియం మోతాదు 30 మిల్లీ గ్రాములుండాలి.,లీటరు నీటిలో ఐరన్ మోతాదు 0.3 మిల్లీ గ్రాములుండాలి, లీటరు నీటిలో ఫ్లోరైడ్ మోతాదు 1 మిల్లీ గ్రాములు మించరాదు… కానీ మినరల్ వాటర్ పేరుతో తాగే నీటిలో పైన చెప్పినవేవీ తగు ప్రమాణాల్లో ఉండవు. కానీ ఒక్క లీటరు 20 రూపాయలైనా కొంటున్నాం తాగుతున్నాం బీఐఎస్ ప్రమాణాల ప్రకారం.. నీటిని నింపే సీసాలు, క్యాన్లు పాలీ ఇథిలిన్, పాలీవినైల్ క్లోరైడ్, పాలీప్రొపిలీన్‌తో తయారైన వాటిని వినియోగించాలి. కానీ ధర ఎక్కువన్న కారణంతో ప్లాంట్లలో నాసిరకం పెట్‌బాటిల్స్‌ను వినియోగిస్తున్నారు.

ఈ రకం ప్లాస్టిక్ బాటిల్ లో బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతోంది.మినరల్‌ వాటర్‌ తాయారు చేసే కంపెనీలు ఒక్క లీటర్‌ మినరల్‌ వాటర్‌ను తయారు చేయడానికి దాదాపు పది లీటర్ల నీటిని వృథా చేస్తున్నాయి. విచక్షణా రహితంగా భూగర్భ జలాలను వాడుకుంటున్నాయి. ఈ కారణంగా చుట్టూ ఉన్న నివాస ప్రాంతాల్లో అదే విధంగా పంట పొలాల్లో ఉన్న బావులు, బోరుబావులు ఎండిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు బహుళజాతి సంస్థలను నియంత్రించలేకపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు పాటిస్తున్న జల విధానంలో నీటి వినియోగానికి తాగునీటిదే ప్రథమ ప్రాధాన్యత. అదే ప్రాధాన్యతను మన ప్రభుత్వాలు పాటించాలి. కానీ మన దేశంలో ప్రభుత్వాలను కార్పోరేట్ కంపెనీలే ప్రభావితం చేస్తున్నాయి. కూల్ డ్రింక్ కంపెనీలకు, కిన్లే, ఆక్వాఫినా, బిస్లెరీ లాంటి వాటికి నీటిని ఇచ్చే శ్రద్ధ సామాన్యుడి విషయంలో సర్కారు చూపటం లేదు. ఇదే అదునుగా బహుళజాతి సంస్థలు నీటితో వేల కోట్ల రూపాయలు వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. బహుళజాతి కంపెనీలు పెట్టే పెట్టుబడుల్లో ప్రభుత్వం సగం వెచ్చించినా దేశంలోని అన్ని గ్రామాలకు స్వచ్ఛమైన నీటిని అందించవచ్చని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఈ సంగతులన్నీ సరైన పద్దతిలో ప్రచారం చేయక పోవటం తో.. బాటిల్డ్ విషాన్నే కొనుక్కొని మరీ తాగాల్సి వస్తోంది…

“జలమే జీవం” భూమిలోనే కాదు మానవదేహం లోనూ మూడువంతులు నీరే ఉంటుంది. ఒక్కో చుక్కా మన శరీరం లోకి ఖనిజ లవణాలనీ పోషకాలనీ తీసుకు వెళుతుంది కానీ ఆ నీరే ప్రాణాలని హరించే విషం లా మారితే?? జీవం నింపాల్సిన అమృతమే విషంగా మరితే..!!? నల్లా నీళ్ళలో కలుషితాలుంటాయి ఆరోగ్యం తో ఆటలెందుకు? సీసా నీళ్ళు మంచివి… బొట్టు బొట్టులో విశ్వాసం అంటూ “కార్పోరేట్ మంచి నీళ్ళని” అమ్ముకునే సంస్ఠలు నిబందనలని తుంగలో తొక్కుతున్నాయి.అసలు మామూలు నీళ్ళకంటే ప్రమాదకర బ్యాక్టీరియాలని మనలోకి పంపిస్తున్నాయి…

ఈ-కొలి బ్యాక్టీరియా,కొలి ఫాం ఈ రెండూ  టైఫాయిడ్, కామెర్లు, అతిసార వ్యాధుల కారకాలు,ఎక్కువగా మలం లోనూ,పందులు ఎక్కువగా తిరిగే మురికి గునటలలోనూ ఉండే బ్యాక్టీరియా ఇది. ఎప్పుడూ తడి గా ఉండే వాటర్ ప్లాంట్ లలో ఈ బ్యాక్టీరియా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి.ఓ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే కనీసం పాతిక లక్షలు ఖర్చవుతుంది. దాంతో పాటు, ఐఎస్ఓ తో పాటు ఇతర పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది. చాలావరకు ప్లాంట్లు ఇవేవి పాటించడం లేదు. ఎలాంటి పర్మిషన్ లేకుండా కేవలం 3, 4 లక్షలతో అక్రమంగా ప్లాంట్ వేసేస్తున్నారు. వీటిపై అధికారుల వద్ద ఎలాంటి సమాచారం ఉండదు. ఐఎస్ఐ సర్టిఫికేట్ పొందిన మినరల్ వాటర్ ప్లాంట్లపై అధికారులు రెండు నెలలకోసారి తనిఖీలు నిర్వహిస్తారు. ఐతే అసలు ప్ల్కాంట్ రిజిస్టరే అవక పోతే..!?
Drinking water

అక్రమ మినరల్ వాటర్ తయారీదారులు అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. బస్టాండ్ లూ సినిమా హాళ్ళూ, టూరిస్టు ప్రదేశాల్లోనూ పెద్ద కంపెనీల బ్రాండెడ్ లుక్ తో సీసాలు అమ్ముతున్నారు. ఒక్క దానికీ సరైన గుర్తింపు ఉండదు.20 లీటర్ల మినరల్ వాటర్ కు వారికయ్యే ఖర్చు 3 రూపాయలు కాగా 30 రూపాయలకు అమ్ముతున్నారు. అదే ఐఎస్ఐ మార్కు పొందిన 20 లీటర్ల మినరల్ వాటర్ ఖరీదు 45 రూపాయలు. బ్రాండెడ్‌ కంపెనీలవైతే 65 నుంచి 80 రూపాయల వరకు ధర ఉంటోంది..

మినరల్‌ వాటర్‌ పేరుతో ప్యాకేజ్డ్ వాటర్‌ తయారు చేస్తున్న పలు కంపెనీలు స్థానికంగా లభించే బోరు నీళ్లను తీసుకుని శుద్ధి చేస్తాయి. తరవాత అల్ట్రా వయొలెట్‌, ఓజోనైజేషన్‌ ప్రక్రియల ద్వారా సూక్ష్మ క్రిముల రహితంగా మారుస్తారు. ఇవన్నీ చేసేందుకు అయా కంపెనీలకు ప్యాకెట్స్ పై ముద్రించిన ధరలో నాల్గవ వంతు మాత్రమే ఖర్చువుతుంది. ఇది స్వచ్ఛమైన నీరు అని ఆయా కంపెనీలు ప్రకటించుకోవడం తప్ప ఎలాంటి భరోసా ఉండదు. పైగా వాటి సీలు తీయగానే గాల్లోని సూక్ష్మక్రిములు వాటిలోకి ప్రవేశిస్తాయి. ఈ నీటిని తాగిన వారికి వాంతులు, విరోచనాలు అవుతాయి. కలుషిత నీటి వల్ల పచ్చకామెర్లు, కడుపు, గొంతు ఇన్ ఫెక్షన్ లాంటి వ్యాధులు సంక్రమిస్తాయి. ప్యాకేజ్డ్ డ్రింకింగ్‌ వాటర్‌ను ఏదైనా బ్రాండ్‌ పేరుతో సరఫరా చేస్తే అది ఆహార కల్తీ చట్టం పరిధిలోకి వస్తుంది. నీటిని విక్రయించే సంస్థలు విధిగా భారత ప్రమాణాల సంస్థలోని 145,43 సెక్షన్‌ కింద రిజిస్టర్‌ కావలసి ఉంటుంది. హైదరాబాద్ పరిధిలోని 80 శాతం వాటర్ ప్లాంట్లలో బాక్టీరియా ఆనవాళ్లున్నట్లు ఓ ప్రయివేట్ లాబరేటరీలో జరిపిన పరిశోధనల్లో తేలింది.

ప్రతి లీటరు నీటిలో క్యాల్షియం మోతాదు 75 మిల్లీ గ్రాములుండాలి,ప్రతి లీటరు నీటిలో మెగ్నీషియం మోతాదు 30 మిల్లీ గ్రాములుండాలి.,లీటరు నీటిలో ఐరన్ మోతాదు 0.3 మిల్లీ గ్రాములుండాలి, లీటరు నీటిలో ఫ్లోరైడ్ మోతాదు 1 మిల్లీ గ్రాములు మించరాదు… కానీ మినరల్ వాటర్ పేరుతో తాగే నీటిలో పైన చెప్పినవేవీ తగు ప్రమాణాల్లో ఉండవు. కానీ ఒక్క లీటరు 20 రూపాయలైనా కొంటున్నాం తాగుతున్నాం… బీఐఎస్ ప్రమాణాల ప్రకారం.. నీటిని నింపే సీసాలు, క్యాన్లు పాలీ ఇథిలిన్, పాలీవినైల్ క్లోరైడ్, పాలీప్రొపిలీన్‌తో తయారైన వాటిని వినియోగించాలి. కానీ ధర ఎక్కువన్న కారణంతో ప్లాంట్లలో నాసిరకం పెట్‌బాటిల్స్‌ను వినియోగిస్తున్నారు. ఈ రకం ప్లాస్టిక్ బాటిల్ లో బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతోంది.మినరల్‌ వాటర్‌ తాయారు చేసే కంపెనీలు ఒక్క లీటర్‌ మినరల్‌ వాటర్‌ను తయారు చేయడానికి దాదాపు పది లీటర్ల నీటిని వృథా చేస్తున్నాయి. విచక్షణా రహితంగా భూగర్భ జలాలను వాడుకుంటున్నాయి. ఈ కారణంగా చుట్టూ ఉన్న నివాస ప్రాంతాల్లో అదే విధంగా పంట పొలాల్లో ఉన్న బావులు, బోరుబావులు ఎండిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు బహుళజాతి సంస్థలను నియంత్రించ లేకపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు పాటిస్తున్న జల విధానంలో నీటి వినియోగానికి తాగునీటిదే ప్రథమ ప్రాధాన్యత. అదే ప్రాధాన్యతను మన ప్రభుత్వాలు పాటించాలి.
Water bottles

కానీ మన దేశంలో ప్రభుత్వాలను కార్పోరేట్ కంపెనీలే ప్రభావితం చేస్తున్నాయి.కూల్ డ్రింక్ కంపెనీలకు, కిన్లే, ఆక్వాఫినా, బిస్లెరీ లాంటి వాటికి నీటిని ఇచ్చే శ్రద్ధ సామాన్యుడి విషయంలో సర్కారు చూపటం లేదు. ఇదే అదునుగా బహుళజాతి సంస్థలు నీటితో వేల కోట్ల రూపాయలు వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. బహుళజాతి కంపెనీలు పెట్టే పెట్టుబడుల్లో ప్రభుత్వం సగం వెచ్చించినా దేశంలోని అన్ని గ్రామాలకు స్వచ్ఛమైన నీటిని అందించవచ్చని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఈ సంగతులన్నీ సరైన పద్దతిలో ప్రచారం చేయక పోవటం తో.. బాటిల్డ్ విషాన్నే కొనుక్కొని మరీ తాగాల్సి వస్తోంది…

(Visited 689 times, 61 visits today)