EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

గుండెపోటు రాబోతుందని 6 గంటల ముందే తెలుసుకోవచ్చు.

Author:

ఇంతకు ముందు గుండెపోటు కేవలం వయసు పైబడిన వారికి మాత్రమే వచ్చేది, కానీ ఇప్పుడు 25 ఏళ్ళు వయసున్న యువతలోనూ చాలామందికి గుండెపోటు వస్తుంది, మారిన జీవన పరిస్థుతుల కారణంగా యుక్తవయసులోనే చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు, గుండెపోటు వచ్చిన వారికి ఎంత త్వరగా చికిత్స అందించగలిగితే అంత బతికే అవకాశాలు ఉంటాయి..ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన ఆ మనిషి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది, అయితే ఆ గుండెపోటు ఏ సమయంలో.. ఎలాంటి పరిస్థుతులలో వస్తుందో ఎవరు ఊహించలేరు..కానీ ఈ మహమ్మారిని తానూ కనిపెట్టిన పరికరం ద్వారా ఆరుగంటల ముందే పసిగట్టవచ్చని 16 ఏళ్ళ ఆకాష్ మనోజ్ అంటున్నాడు.

గుండెపోటు akash manoj

తమిళనాడుకు చెందిన ఆకాష్‌ పదో తరగతి చదువుతున్నాడు. గుండెపోటు వచ్చే సూచనను తాను కనిపెట్టిన కొత్త టెక్నిక్‌ ద్వారా తెలుసుకోవచ్చని చెబుతున్నాడు. ఈ పరికరం కనిపెట్టిన ఆకాశ్‌ ‘ఇన్నోవేషన్‌ స్కాలర్స్‌ ఇన్‌ రెసిడెన్స్‌ ప్రోగ్రాం’ కింద రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నాడు.

 గుండెపోటు akash manoj

ఈ సందర్భంగా ఆకాశ్‌ మాట్లాడుతూ.. ‘‘నిశ్శబ్దంగా వచ్చే గుండెపోట్లు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. చాలా మంది పైకి ఆరోగ్యంగానే కనపడతారు. గుండెపోటుకు సంబంధించిన ఎలాంటి లక్షణాలూ వారిలో కనిపించవు. ‘మా తాతయ్య ఆరోగ్యంగా కనిపించేవారు కానీ, ఓ రోజు ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలిపోయారు.’ తాతయ్య మరణం నన్ను బాగా కలిచి వేసింది. గుండెపోటును ముందే కనిపెట్టే పరికరం ఏదైనా తయారు చేయాలనుకున్నా. అందులో భాగంగానే ఈ పరికరాన్ని తయారు చేశా. అయితే దీనిని ఇంకా అభివృద్ధి పరచాల్సి ఉంది. శరీరంపై ఎలాంటి గాయం చేయకుండా దీనిని ఉపయోగించవచ్చు’ అని రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శన సందర్భంగా పేర్కొన్నాడు. ‘రక్తంలో ఉండే ఎఫ్‌ఏబీపీ3 అనే చిన్న ప్రొటీన్‌ను ఉపయోగించి గుండెపోటు ప్రమాదాన్ని కనిపెట్టవచ్చు’ అని ఆకాశ్‌ తెలిపాడు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి ఈ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గుండెపోటు ప్రమాదాన్ని ముందే గుర్తించి డాక్టర్‌ను సంప్రదించడం ద్వారా సరైన చికిత్స తీసుకోవచ్చని తెలిపాడు. ఈ పరికరాన్ని నిపుణుల సాయంతో అభివృద్ధి పరిచి ప్రజలకి అందుబాటులోకి తెస్తే ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చు..!

(Visited 2,819 times, 2,887 visits today)

Comments

comments