Home / Entertainment / ‘కత్తిలాంటోడు’ గా వస్తున్న మెగాస్టార్ చిరంజీవి.

‘కత్తిలాంటోడు’ గా వస్తున్న మెగాస్టార్ చిరంజీవి.

Author:

kaththilantodu

8 ఏళ్ల నిరీక్షణకు తెరపడనుంది, ఎప్పుడు ఎప్పుడా అని మెగా అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా ఈ నెల 29న మొదలుకానుంది. వినాయక్ దర్శకత్వంలో రానున్న చిరంజీవి 150వ సినిమా కి రామ్చరన్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. మెగాస్టార్ రాజకీయాల్లోకి వచ్చినప్పటినుండీ సినిమాలలో నటించడం మానేశారు. అప్పుడప్పుడు మగధీర, బ్రూస్లీ సినిమాలలో గెస్ట్ రోల్స్ చేసినా గాని తెలుగు ప్రేక్షకులు ఇంతకుముందులా చిరంజీవి నటనను మొత్తం ఆస్వాదించలేకపోయారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని మూసేసినప్పుడే సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తారని అందరూ భావించారు, కానీ అందుకు భిన్నంగా చిరంజీవి ఇన్ని రోజులు సినిమాలు చేయకుండా ఆగారు. అప్పుడు, ఇప్పుడు అని, కథ నచ్చడంలేదు అని సినిమా మొదలుకాకాపోవడంతో అందరూ ఇక చిరంజీవి సినిమా రాదు ఏమో అని అనుకున్నారు. కానీ అందరి కోరిక ఫలించి తమిళంలో వచ్చిన “కత్తి” సినిమా స్టోరీ నచ్చడంతో ఆ సినిమాని తెలుగులో రీమేక్ చెయాడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిరంజీవి మునుపటిలా తన అభినయంతో, డాన్స్‌లతో మనందరినీ ఆకట్టుకోవాలని మనమందరం ఆల్ ద బెస్ట్ చెబుదాం.

(Visited 1,084 times, 9 visits today)