EDITION English తెలుగు
డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

స్పెయిన్ –మొరాకో బోర్డర్ ని భారత్- పాక్ సరిహద్దుగా చూపించిన రక్షణ శాఖ అధికారులు.

Author:

కేంద్ర రక్షణ శాఖ ఈ ఏడాది విడుదల చేసిన వార్షిక పత్రికలో ఘోర తప్పిదం చోటు చేసుకుంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్ల ఖర్చు వివరాలకు గాను ఒక తప్పు ఫోటో జత చేయడం గమనార్హం. స్పెయిన్ –మొరాకో బార్డర్ ఫోటోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు ఫోటోకు బదులుగా ప్రచురించారు. విషయం తెలిసిన వెంటనే ఆగ్రహించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెంటనే దర్యాప్తుకి ఆదేశించారు. అసలు ఇంత పెద్ద తప్పు ఎలా జరిగిందనే విషయంఫై సమగ్ర దర్యాప్తు చేయాలని ఎంక్వయిరీ వేశారు. దీనిపై రక్షణ శాఖ సెక్రెటరీ రాజీవ్ మేహ్రిషి స్పందిస్తూ, ఇప్పటికే ఈ విషయమై దర్యాప్తు ప్రారంభించామని త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు.

border

ప్రతి ఏటా కేంద్ర రక్షణ శాఖ ఒక వార్షిక పత్రిక విడుదల చేస్తుంది. ఆ ఏడాది పాటూ అనుకున్న, అమలు చేసిన పథకాలు, వాటి ఖర్చులు మొదలైన వివరాలన్నీ ఈ బుక్ లో పొందుపరుస్తారు. ఏప్రిల్ 2017లో జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ వార్షిక రిపోర్టు విడుదల చేశారు. పత్రికలోని 40 వ పేజీలో ఈ తప్పు ఫోటోని ప్రచురించారు. కానీ, ఈ తప్పిదాన్ని ఎవరూ గమనించలేదు. ఈ తప్పిదాన్ని ముందుగా ఒక ఆన్ లైన్ పత్రిక గమనించి, రక్షణ శాఖ దృష్టికి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది.

భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో దాదాపు 2043.76 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయాల్సిన ఫ్లడ్ లైట్లకు గానూ 1943.76 కిలోమీటర్ల పని పూర్తయినట్టు ఇంకో 100కిలోమీటర్ల పని మిగిలి ఉంది అని తెలుపుతూ ఈ ఫోటోని రుజువుగా జతపరిచారు. ప్రచురించిన స్పెయిన్ –మొరాకో బార్డర్ ఫోటో నిజానికి 2006 లో స్పెయిన్ కి చెందిన ఫోటోగ్రాఫర్ తీసినది. ఏది ఏమైనా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన రక్షణ శాఖ రిపోర్టుల్లోనే ఇలాంటి తప్పు దొర్లడం, అదీ దేశ సరిహద్దులకు సంభందించిన ఫోటోలోనే తప్పు జరగడం నిజంగా క్షమార్హం కాదు. రక్షణ శాఖ దర్యాప్తు లోని అసలు విషయాలు బయటపడితే కానీ.. అసలేం జరిగిందో, ఈ తప్పుఎలా జరిగిందో చెప్పలేం.

(Visited 123 times, 27 visits today)

Comments

comments