స్మార్ట్ టీవీ ఇక మన బడ్జెట్ లోనే-MI వారి కొత్త ఉత్పత్తులు

Author:

ఏదేమైనా చైనా కంపెనీల తీరే వేరు.ఎంత నాసిరకం వైనా మన దేశవాళీ ఉత్పత్తుల కన్నా మెరుగ్గానే ఉంటాయి. పైగా ధర తక్కువ లో దొరుకుతాయి. మధ్య తరగతి మహారాజులను మెప్పించేందుకు మొబైళ్ళ రంగంలో అగ్రగామి గా ఉన్న చైనా కంపెనీ ‘షియోమీ'(‘MI) టీవీ మార్కెట్లోకీ ప్రవేశించింది.

గతంలో MI TV 4మోడల్ తో అమ్మకాలు పెంచుకొన్న ఈ కంపెనీ మరిన్ని మోడళ్ళను భారత్ లో ప్రవేశ పెడుతోంది. కొత్తగా ఎల్.ఈ.డి “స్మార్ట్ టీవీ 4సి” ని మార్చి నెలలోనే మార్కెట్లోకి తేనున్నారు. కంపెనీ వెబ్ సైట్లో ఈ టీవీ ధర 27999/-గా ప్రకటించారు.

MI 4C T V ప్రత్యేకతలు

*43అంగుళాల స్క్రీన్

*ఒక జీబీ ర్యామ్

*8జీబీల అంతర్గత మెమొరీ

*క్వాడ్రకోర్ 962-64బిట్ ల ప్రాసెసర్

*అత్యంత సన్నని ఫుల్ హెచ్ డీ ప్యానెల్

* డాల్బీ డిజిటల్ సౌండ్ సిస్టమ్

*వైఫై

*బ్లూటూత్ తో పాటు యుఎస్ బి పోర్టల్ కూడా

మొత్తానికి మన డ్రాయింగ్ రూం లో కార్యక్రమాలు వీక్షించే విధానం మరింత నాణ్యంగా మారడం ఖాయం.

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 69 visits today)