EDITION English తెలుగు
Video: సినిమాలకు ఇక సెలవు : పవన్ కల్యాణ్.   ఇక వాట్సాప్ లో డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు.   హైదరాబాద్ నగరం అసలు పేరు ‘ చిచులం ’, ఇదే నిజమైన పేరు, ఈ విషయం చాలామందికి తెలియదని చారిత్రక పరిశోధకుడు పాండులింగారెడ్డి తెలిపారు.   స్కూల్ కి రావట్లేదని అడిగినందుకు.. ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన స్టూడెంట్.   షాకింగ్ న్యూస్: మూతపడిన ట్రంప్ ప్రభుత్వం, సంక్షోభంలో అమెరికా...!   Video: మెట్రో నుంచి రోడ్ మీద వెళ్తున్న కారులో దిగబడిన రాడ్.   క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారి.. సాయం అందించాలనుకునే వారు అకౌంట్ నం. 80808080101026419 లో డబ్బులు వేయండి.   డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!   Video:స్కూల్ కి పది నిముషాలు లేట్ గా వచ్చాడని.. బాతులా నడిపించి..బలి తీసుకున్నారు.   పెద్ద పెద్ద క్రేన్లు ఆ హనుమాన్ విగ్రహాన్ని ఇంచుకూడా కదలించలేక పోయాయి.
Home / Reviews / మిస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్.

మిస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్.

మిస్టర్ రివ్యూ రేటింగ్

Alajadi Rating

2.0/5

Cast: వరుణ్ తేజ్, హేభ, లావణ్య త్రిపాఠి, ఆనంద్, తనికెళ్ళ భరణి, నాజర్‌, మురళీశర్మ, సత్యం రాజేష్ తదితరులు.

Directed by: శ్రీను వైట్ల

Produced by: నల్లమలపు శ్రీనివాస్‌(బుజ్జి).. ఠాగూర్‌ మధు

Banner: లక్ష్మినరసింహ ప్రొడక్షన్స్‌

Music Composed by: మిక్కి జె. మేయర్‌

రెడీ, దూకుడు, బాద్షా లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న శ్రీను వైట్ల ఆగడు, బ్రూస్ లీ లాంటి ప్లాప్ సినిమాలతో అందరి నుండి విమర్శలు ఎదుర్కొన్నాడు, ఎలాగైనాయిన మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని తనకి అచ్చొచ్చిన ఫార్ములా కథలని వదిలి వరుణ్ తేజ్ తో మిస్టర్ అనే సినిమాని తీసాడు, ఈరోజు విడుదల అయిన మిస్టర్ సినిమా ఎలాంటి ఫలితం ఇచ్చిందో తెలుసుకోండి.

కథ :

స్పెయిన్ లో ఉంటూన్న చై (వరుణ్ తేజ్) అనుకోకుండా మీరా (హేభ పటేల్)కి పరిచయముతాడు, స్పెయిన్‌లో ఉన్న నాలుగు రోజుల్లో మీరా.. చైల మధ్య స్నేహం బాగా పెరుగుతుంది. వచ్చిన పని పూర్తవగానే మీరా ఇండియాకి వెళ్లిపోతుంది, ఆ తరువాత ఒక సమస్యని పరిష్కరించడానికి ఇండియా కి వచ్చిన చై కి చంద్రముఖి(లావణ్య త్రిపాఠి) ఎదురవుతుంది. అసలు చంద్రముఖి ఎవరు..? చై ఇండియాకి ఎందుకు వచ్చాడు? మీరా తో తన ప్రేమ విషయాన్నీ చెప్పాడా..? అనేది తెరమీదనే చూడాలి.

అలజడి విశ్లేషణ :

ప్రేమను వెతుక్కుంటూ వెళ్తే.. ఆ ప్రేమే మనల్ని వెతుక్కుంటూ వస్తుందనే అంశం ఆధారంగా ఈ చిత్రం సాగుతుంది. వరుస పరాజయాలతో డీలా పడిన శ్రీనువైట్ల ఈ సినిమా కోసం చాలా పెద్ద కథనే రాసుకున్నాడు, ఒక పెద్ద కథ, దానిలో మరికొన్ని ఉప కథలు ఉంటడం వల్ల మనకి అసలు కథ అర్ధం కాదు, ఎప్పటికప్పుడు కొత్త పాత్రలు తెరపైకి వస్తూనే ఉంటాయి. కొత్త కథలు పుడుతూ, ఆ కథల్లోనూ బోలెడన్ని మలుపులు చోటు చేసుకుంటుంటాయి.

ఫస్ట్ అఫ్ లో వరుణ్ తేజ్ , హేభ పటేల్ ల మధ్య జరిగే సన్నివేశాలు, ఇంటర్వెల్ ముందు వరకు సినిమా చాలా మంచిగా ఉంటుంది ఇంటర్వెల్ తరువాత సినిమా ఎలాంటి మలుపులు తిరుగుతుందో ప్రేక్షకులకి అర్ధం కాదు, ఈ సినిమాలో ప్రేమ, ఎమోషన్స్, కుటుంబం అంటూ శ్రీని వైట్ల మంచి ప్రయత్నమే చేసిన వాటికీ ప్రేక్షకులు కనెక్ట్ అవ్వటం కొంచెం కష్టం, క్లైమాక్స్ సన్నివేశాలని కూడా బలంగా తీయలేకపోయారు, కాకపోతే వరుణ్ తేజ్ , హేభ పటేల్ లు కొత్తరకం క్యారెక్టర్లు ప్రేక్షకులకి ఊరటని ఇస్తాయి.

నటీనటుల పనితీరు:

వరుణ్ తేజ్: కొత్తరకం క్యారెక్టర్ లో వరుణ్ తేజ్ బాగా చేసాడు, ముఖ్యంగా కొన్ని ఎమోష‌నల్ సీన్స్ లో త‌న న‌ట‌న చాలా బాగుంది. లుక్స్ ప‌రంగానూ ఆక‌ట్టుకున్నాడు.

హేభ పటేల్ : హేభకి బాగా అలవాటు అయిన క్యారెక్టర్ నే ఈ సినిమాలో కూడా చేసింది కానీ తన టాలెంట్ తో ఆకట్టుకుంది.

లావణ్య త్రిపాఠి: లావ‌ణ్య త్రిపాఠి మెరుగైన న‌ట‌న చూపించింది. ప‌ల్లెటూరి అమ్మాయిగా, త‌ను ప్రేమించిన అబ్బాయి కోసం ఏమైనా త్యాగం చేసేదానిలా బాగా మెప్పించింది.

కమెడియన్ పాత్రలు నవ్వించే ప్రయత్నం చేసిన వర్క్ అవుట్ అవ్వలేదు, మిగిలిన పాత్రలు బాగానే చేసారు.

ప్లస్ పాయింట్స్:

  • వరుణ్ తేజ్ , హేభ పటేల్
  • కెమెరా వర్క్
  • మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

  • కథ , స్క్రీన్ ప్లే
  • ఎడిటింగ్

పంచ్ లైన్ : రొటీన్ కథలతో సినిమా తీస్తే పరాజయం అదే వెతుక్కుంటూ వస్తుంది.

Comments

comments