టిఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు వర్సెస్ ఎమ్మెల్సీలు..!

Author:

తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించి రాష్ట్రం సాధించి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య ఉన్న విభేదాలు ముఖ్యమంత్రి కెసిఆర్ దగ్గరికి చేరాయి, ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఎమ్మెల్సీలు అనవసరంగా జోక్యం చేసుకొని వచ్చే ఎన్నికలలో తమకే ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ప్రచారం చేస్తూ సొంత క్యాడర్ ఏర్పాటు చేసుకొని వర్గ రాజకీయాలు చేస్తున్నారనే నివేదిక ఇంటెలీజెన్స్ విభాగం నుండి ముఖ్యమంత్రి వద్దకు చేరింది. ఈ విషయంపై క్యాంపు ఆఫీస్ లో కొంతమంది ఎమ్మెల్సీలకి కెసిఆర్ ఇలాంటి పనులు ఏంటని హెచ్చరించారు.

టిఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు వర్సెస్ ఎమ్మెల్సీలు..! - mla vs mlc

2014 ఎన్నికలకి ముందు ఇతర పార్టీల నుండి చాలామంది నేతలు టిఆర్ఎస్ లో చేరారు, వారిలో చాలామందికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు, వారంతా ఇప్పుడు వచ్చే ఎన్నికలలో కోసం నియోజకవర్గాలలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారని, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఫెయిల్ అయ్యారని వచ్చే ఎన్నికలలో టికెట్ తమకే వస్తుందనే ప్రచారం తన అనుచరులతో చేయిస్తున్నారని, ముఖ్యంగా వరంగల్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నేతలు ఇలా చేస్తున్నారనే విషయంపై ముఖ్యమంత్రికి ఫిర్యాదులు అందడంతో ఆ ఎమ్మెల్సీలకి కెసిఆర్ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు, ఇలాంటి పనులు చేసి పార్టీ కార్యకర్తలని గందరగోళానికి గురిచేయవద్దని హెచ్చరించారు.

(Visited 99 times, 117 visits today)