EDITION English తెలుగు
హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.   ఈ ఫొటో చూడగానే "బాషా" సినిమా గుర్తు వస్తే తప్పు లేదు. నిజంగానే ఆటో వెనకాల రాసిన దాన్ని ఆచరించి చూపిస్తున్నాడు హైదరాబాద్ కు చెందిన ఈ ఆటో డ్రైవర్.   స్మార్ట్ టీవీ ఇక మన బడ్జెట్ లోనే-MI వారి కొత్త ఉత్పత్తులు   పండంటి కాపురానికి పది సూత్రాలు..   ఇలా పండ్లు ఎప్పటికీ పిల్లలకు పెట్ట కూడదు

Video: గోల్డ్ షాప్ లో దొంగతనం చేసిన కోతి.

Author:

కోతి కదా కోతి పనులు చేస్తుంది… కానీ దొంగ పనులు చేస్తే..? మనిషైతే కేసు పెట్టటమో పట్టుకొని నాలుగు ఉతకటమో చేస్తాం గానీ కోతినేం చేసేదీ..? అసలు ఏమైనా చేయటానికి దొరకాలి కదా.. ఇలాంటి సంఘటనే ఈ మధ్య గుంటూరులో జరిగింది. ఆ కథేమిటంటే…

Monkey-robbery-video

గుంటూరు పట్టణంలో ఉన్న ఒక నగల షాప్ లోకి ఒక కోతి దర్జాగా తలుపు తోసుకొని మరీ వచ్చింది. అంతటితో ఆగలేదు మరీ దర్జా ఒలకబోస్తూ అప్పుడే పక్కకు వెళ్ళిన యజమాని కుర్చీలో సెటిలయ్యింది. అక్కడే ఉన్న ఏదో ఒక వస్తువుని తీసుకొని పగల గొడుతుందేమో..,లేదంటే కస్టమర్ల మీద దాడి చేస్తుందేమో అనుకున్న షాప్ ఓనర్ దాన్ని కాస్త అదిలించి బెదర గొట్టటానికి ప్రయత్నించాడు. అంతే మన కోతి గారికి కోపమొచ్చింది. వెంటనే క్యాష్ సొరుగు తెరిచి చేతికందిన నోట్లకట్ట తీసుకొని ఉడాయించింది. ఒకటీ రెండు కాదు ఏకంగా 10,000 రూపాయలని పట్టుకొని పారిపోవటంతో ఏం చేయాలో తెలియని ఆ షాప్ ఓనర్ తల పట్టుకున్నాడూ. స్టాఫ్ కొంత మంది దాని వెంట పడ్డారు కానీ అది వారి చేతికి దొరక్కుండా పారిపోయింది.

అయితే ఈ సంఘటనంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. సరే డబ్బులెటూ పోయాయి కదా ఆ కోతిగారి ఘనకార్యాన్ని అందరికీ చుపిద్దామని దాన్ని యూట్యూబ్ లో పెట్టారు. ఇక చూస్కోండి మన దొంగ నా కోతి చేసిన కోతి పనికి నెటిజన్లు నవ్వాపుకోలేక షేర్ల మీద షేర్లు చేసి పడేస్తున్నారు. ఇప్పుడీ కోతి గారి చోర కళ వీడియో వైరల్ అయ్యింది,ఈ దొంగతనం కోతి తెలియక చేస్తే ఏం కాదు కాని, అదే ఎవరైనా కేటుగాళ్ళు కోతికి ట్రైనింగ్ ఇచ్చి మరి దొంగతనం చేయిస్తే పోలీసులకి దొంగ కోతిలతో కొత్త సవాల్ ఎదురైనట్లే అని అనుకుంటున్నారు ఈ వీడియోని చూసిన వాళ్ళు..!

(Visited 2,258 times, 167 visits today)

Comments

comments