Home / Entertainment / బాహుబలి కి తెలంగాణాలో 5, ఏపీ లో 6 షోలు.

బాహుబలి కి తెలంగాణాలో 5, ఏపీ లో 6 షోలు.

Author:

సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బాహుబలి 2 సినిమా ఈ నెల 28 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొదటి భాగం క్రియేట్ చేసిన రికార్డులతో ఎన్నొ అంచనాలతో వస్తున్న బాహుబలిని చూసేందుకు సినీ ప్రేక్షకులు  థియేటర్లకు పెద్ద ఎత్తున పోటెత్తటం ఖాయమంటున్నారు ట్రేడ్ వర్గాలు. అయితే ప్రేక్షకుల తాకిడిని తగ్గట్లుగా రోజుకు ఎక్కువ షోలు వేసుకునేందుకు అనుమతించాలంటూ బాహుబలి చిత్ర నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. వారు కోరుకున్న విధంగానే బాహుబలి 2 సినిమా రోజు 5 షోలు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తే, ఏపీ సర్కార్ ఒక అడుగు ముందుకేసి రోజు 6 షోలు వేసుకునేందుకు అనుమతిచ్చింది.

baahubali 2 tickets

తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన బాహుబలి సినిమాకు తమ పూర్తి సహకారం ఉంటుందని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి, దీనితో బాహుబలి 2 సినిమా యూనిట్ కి కొత్త ఉత్సాహం లభించింది. ఎక్కువ థియేటర్లు, ఎక్కువ షోలలో ఇప్పటి వరకు ఉన్న అన్ని సినిమా రికార్డులని బాహుబలి 2 సినిమా బద్దలు కొట్టనుంది. ఇంకెందుకు ఆలస్యం తొందరగా మీరు కూడా బాహుబలి టికెట్లు బుక్ చేసుకోండి.

(Visited 245 times, 6 visits today)