EDITION English తెలుగు
Home / Inspiring Stories / అమాయక అమ్మాయి ప్రాణం తీసిన ఫేస్ బుక్ పోస్ట్.

అమాయక అమ్మాయి ప్రాణం తీసిన ఫేస్ బుక్ పోస్ట్.

Author:

స్మార్ట్‌ఫోన్ మరియు ఫేస్ బుక్ ఇప్పుడు చాలామంది జీవితంలో ఇవీ ఒక భాగమైపోయాయి. మంచికి వాడితే పర్వాలేదు కానీ ఇవే ఇప్పుడు ఆడపిల్లల ప్రాణాలు తీసేదాకా వచ్చాయి. ఎటువంటి తప్పు చేయకున్న ఎవరో ఆకతాయి ఫేస్ బుక్లో పెట్టిన పోస్ట్ వలన ఒక అమ్మాయి ప్రాణం వదిలింది. ఇటువంటి సంఘటనలు టెక్నాలజీ ని సరైన పద్దతుల్లో వాడుకోక పోతే జరిగే అనర్దాల గురించి మనను హెచ్చరిస్తూనే ఉంటాయి. తమిళనాడులో జరిగిన ఈ యదార్ధ సంఘటన చదవండి.

Vinupriya suicide

తమిళనాడులోని సేలం జిల్లాలో చేనేత కార్మికుడైన అన్నాదురై కుమార్తె వినుప్రియ ఒక ప్రేమోన్మాది చేసిన ఆకతాయి పనికి తనువు చాలించింది. వినుప్రియ బిఎస్సి పూర్తి చేసి ప్రయివేట్ పాఠశాలలో టీచర్ గా పని చేస్తోంది. సురేష్ అనే యువకుడు చాలా రోజులుగా వినుప్రియను ప్రేమించమని వెంటపడుతున్నాడు దానితో విసిగిపోయిన వినుప్రియ వారి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. దీనితో అన్నాదురై సురేష్ కి మా అమ్మాయి వెంట పడొద్దని చెప్పి చూశాడు. కానీ సురేష్ ఆ మాటలను పెడచెవిన పెట్టి యధాతధంగా మళ్ళీ వినుప్రియ వెంటపడి ప్రేమించమని వేధించడం మాములు అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఎంతచెప్పిన వినుప్రియ తన ప్రేమను అంగీకరించకపోవడంతో ప్రేమొన్మాదిగా మారిన సురేష్, వినుప్రియ ఫోటోలు సంపాదించి వాటిని అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలిసిన వినుప్రియ తండ్రి  అన్నాదురై స్థానిక ఎస్పీ కార్యాలయంలో కంప్లెయింట్ చేసాడు. వారు ఆ ఐడిని బ్లాక్ చేయాలంటే కనీసం 20 రోజులు టైం పడుతుందని అనడంతో అన్నాదురై సైబర్‌క్రైం పోలీసుల వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. వెంటనే స్పందించాల్సిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు లంచానికి కక్కుర్తి పడి అన్నదురై ని డబ్బుల కోసం వేదించారు. కేసు నమోదు చేయాలంటే ఒక కొత్త ఫోన్ లంచంగా ఇవ్వాలని క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్ సురేష్ డిమాండ్ చేశాడు. కష్టమైన అన్నాదురై ఆ కానిస్టేబుల్ కి ఫోన్ కొని ఇచ్చాడు. దానితో ఇక మనశ్శాంతిగా ఉండొచ్చు అనుకుంటున్న టైం లో జూన్ నెల 26వ  తేదీన మళ్ళీ వినుప్రియ మార్పింగ్  ఫొటోస్ ఫేస్ బుక్ లో ప్రత్యక్షం అవడంతో అన్నాదురై ఫ్యామిలీ ఒక్కాసారిగా ఉలిక్కి పడింది. మళ్ళీ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. అయిన వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తన గురించి తన తల్లిదండ్రులు పడుతున్న భాధ చూడలేక వినుప్రియ  ఉరివేసుకొని చనిపోయింది.

Must Read: నన్ను కాపాడే ఒక్క మగాడు లేడా?

జీవితంలో ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాల్సిన ఆమ్మాయి ఇలా అర్థంతరంగా తనువు చాలించడంతో వారి కుంటుంబం దుక్కసాగరంలో మునిగిపోయింది. లంచంగా ఫోన్ తీసుకున్న సైబర్ క్రైమ్ కానిస్టేబుల్ ని సస్పెండ్ చేశారు. ఫోటో మార్పింగ్ చేసిన సురేష్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఫేసు బుక్ లో మీతో అసభ్యంగా ప్రవర్తించే వారిని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ ఇవ్వండి లేదా వారికి దూరంగా ఉండండి. ఫేక్ ఐడిల నుండి రిక్వెస్ట్ లను యాక్సెప్ట్ చేయకండి. ఇలాంటి యాప్ లు అనేవి మంచి పనికోసం ఉపయోగించాలి కానీ ఇలా ప్రాణాలు తీసేందుకు కాదు. ఒక్కసారి ఆలోచించండి మనకు అక్క,చెల్లెల్లు ఉన్నారు….

Must Read: ఇది తాగితే 15 రోజులలో బలహీనంగా ఉన్న మీ ఎముకలు బలంగా అవుతాయి.

(Visited 14,715 times, 53 visits today)