Home / Inspiring Stories / మనుషుల్లో మానవత్వం లేదని ఎవరు అన్నారు..!!??

మనుషుల్లో మానవత్వం లేదని ఎవరు అన్నారు..!!??

Author:

pickpocketer india

బస్ నుంచి దిగి జేబులో చేయి పెట్టి చూసే సరికి జేబుకి చిల్లుంది.. పర్సు మాయం అయిపొయింది.. ఎవరో కొట్టేసారాని నిర్దారించుకున్నాడు, ఆరోజే ఉద్యోగం మానేసిన యువకుడు. నిరుత్సాహంలో ఉన్న ఆ యువకుడు.. పర్స్ పొతే పొయిందిలే.. అందులో ఉన్నది 150 రూ..!! ఇంకా అమ్మకి రాసిన ఒక లెటర్, ఆ లెటర్లో.. ” అమ్మా నా ఉద్యోగం పోయింది.. నేనింక డబ్బులు పంపించలేను.. నువ్వు ఏలాగోలా సర్దుకో.. నన్ను మన్నించు అని రాసుకున్నాడు.. ”

పోస్ట్.. చేద్దాం అంటే మనస్సు రాలేదు, రాత్రి లోగా అయినా పోస్ట్ చేద్దాం అనుకునే లోపలే ఎవరో దొంగ తన పర్స్ కొట్టేసాడు. సామాన్యంగా 150 రూ.. అంటే పెద్ద అమౌంట్ ఏం  కాదు.. కాని.. ఉద్యొగం లేని వాళ్ళకు అది 1500రూ తో సమానం. కొన్ని రోజుల తరువాతా అమ్మ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది, ఉత్తరం ఓపెన్ చేయాలి అంటే మనస్సులో ఆందోళన, ఇంకా డబ్బు పంపలేదు అని ఉంటుందని. ఓపెన్ చేసి చూస్తే… ” నాన్నా.. నాకు నీవు చేసిన మనీ ఆర్డర్ 500 రూ చేరింది. నువ్వు వేళకు తిను ఆరోగ్యం జాగ్రత్తగా చూస్కో..” అని రాసి ఉంది. ఆ యువకుడికి ఏం అర్దం కాలేదు, నేను పంపలేదు.. మరి ఎవరు పంపించారు అని అలొచనలో ఉండగా… మరుసటి రోజు ఇంకొక  ఉత్తరం వచ్చింది. అర్దం చేసుకునేల లేని చేతి రాత, అన్నా… నీ 150రూపాయలకు నేనొక 350రూ కలిపి అమ్మకి మని ఆర్డర్ చేసాను.. అమ్మ ఎవరికైన అమ్మే.. తాను ఎందుకు ఆకలితో ఉండాలి?

ఇట్లు,
నీ పిక్ పాకిటర్ బ్రదర్..
(“దొంగ అయినా అతడు చూపిన మానవత్వం నేడు మనలో చాలా మంది మర్చిపోతున్నాము. మానవత్వం మనల్ని మహోన్నతంగా నిలబెడుతుంది. అదే లేనినాడు మనిషి జంతువుతో సమానము.”)

(Visited 261 times, 53 visits today)