Home / Political / త్రిపుల్ తలాక్ నుంచి కాపాడమని హనుమంతుడిని ప్రార్థంచిన ముస్లిం మహిళలు.

త్రిపుల్ తలాక్ నుంచి కాపాడమని హనుమంతుడిని ప్రార్థంచిన ముస్లిం మహిళలు.

Author:

కొన్ని రోజులుగా దేశంలోని రాజకీయ నాయకులను ముప్ప తిప్పలు పెట్టిస్తున్న అంశం త్రిపుల్ తలాక్. ముస్లింలలో అమలవుతున్న ట్రిపుల్ తలాక్ విషయంలో ఎవరికి సపోర్ట్ చేస్తే ఎటునుండి వ్యతిరేతక వస్తుందో అని ఆచి తూచి వ్యవహరిస్తున్నారు పెద్దలందరూ. ఇదొక దురాచారమని, త్రిపుల్ తలాక్ పేరుతో అడ్డగోలుగా ముస్లిం మహిళలను హింసిస్తున్నారని ముస్లిం మహిళలు వాదిస్తుండగా, ఇది మతానికి సంబందించిన విషయమని, ఎప్పటినుండో పాటిస్తున్న ఆచారంలో ఇప్పుడు మార్పులు చేయాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు ముస్లిం మతపెద్దలు. త్రిపుల్ తలాక్ వలన ముస్లిం మహిళలకు రాజ్యాంగం ప్రసాదించిన మౌలిక హక్కులకు భంగం కలిగుతుందన్న పలు అభ్యర్థనలకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణ చేపట్టనున్నది, అయితే ఈ సమస్య పై తమకు న్యాయం జరగేలా చూడమని పలువురు ముస్లిం మహిళలు నిన్న వారణాసిలోని పలు హనుమాన్ దేవాలయాల్లో పూజలు నిర్వహించారు అంతే కాకుండా ఆంజనేయస్వామి ఆలయాలలో కూర్చుని సామూహికంగా హనుమాన్ చాలీసా పఠించారు. హనుమాన్ చాలీసా పఠిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయన్న నమ్మకంతో అలా చేశామని ముస్లిం మహిళలు తెలిపారు.

muslim women praying hanuman

సుప్రీం కోర్టు విచారణపై అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు మరికొన్ని ముస్లిం సంస్థలు గుర్రుగా ఉన్నాయి. త్రిపుల్ తలాక్ అనేది మతపరమైన విషయమని, అందులో కోర్టుల జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు ముస్లిం మతపెద్దలు. కాని మారుతున్న కాలంతో పాటు మనుషులు మారాలని కొంతమంది త్రిపుల్ తలాక్ ని అడ్డం పెట్టుకుని తమ భార్యలను వేదిస్తున్నారని దీనికి చట్టబద్దత లేదని వాధిస్తున్నారు ముస్లిం మహిళలు. దీనిపై విచారణ తరువాత సుప్రీం కోర్టు ఎటువంటి తీర్పుని ఇస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Comments

comments