EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

Video: మై విలేజ్ షో… మస్తుంది రా బై…!

Author:

రెండు, మూడు సంవత్సరాల నుండి యూ ట్యూబ్ వీడియోల హవా పెరిగిపోయింది, జియో ఎఫెక్ట్ తో డేటా రేట్లు బాగా పడిపోవటం, స్మార్ట్ ఫోన్లు చిన్న చిన్న గ్రామాలలోకి ప్రవేశించడం వల్ల యూట్యూబ్ వీడియోలు చూసేవాళ్ళతో పాటు, తీసేవాళ్ళు కూడా బాగా పెరిగిపోయారు, షార్ట్ ఫిలిమ్స్, డాన్స్ వీడియోలు, సినిమా వీడియోలు అంటూ రకరకాల వీడియోలు వస్తున్నాయి, ఇలాంటి వీడియోల్లో కొన్ని విసుగు తెప్పించేవి ఉంటే మరికొన్ని సూపర్బ్ వీడియోలు ఉంటాయి, ఇలా తెలంగాణ గ్రామీణ జీవితాలని కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ, ఊరిలో ఉండే మనుషుల మధ్య జరిగే విషయాలనే కాన్సెప్ట్ గా తీసుకోని కొంతమంది యువకులు My Village Show అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా జనాలు ఫుల్ గా నవ్వుకునేలా చేస్తున్నారు.

వీరి వీడియోలలో పెద్ద పెద్ద లొకేషన్లు, పేరొందిన యాక్టర్ లు ఎవరు ఉండరు, ఊర్లో ఉండే మనుషులే ప్రధాన పాత్రధారులు, ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో జరిగే విషయాలే వీరికి కాన్సెప్ట్, చిన్న చిన్న కాన్సెప్ట్ లతో మంచి మంచి డైలాగ్స్ తో అందరు ఫిదా అయ్యేలా ఊర్లోనే ఉంటూ వీడియోలు తీసేస్తున్నారు.

My Village Show మై విలేజ్ షో

ఎం.టెక్ చేసి ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీగా చేస్తూ ఆ పని నచ్చక సమాజానికి ఏదో ఒకటి చేయాలనీ యూట్యూబ్ ఛానెల్ ని ప్రారంభించి సమాజానికి ఉపయోగపడే ఆలోచలతో వీడియోలు తీస్తుండేవాడు కరీంనగర్ కి చెందిన శ్రీకాంత్, కానీ ఆ వీడియోలకి ఎక్కువ ఆదరణ లభించకపోయేది, సమాజానికి ఉపయోగపడే వీడియోలలో ఎంటర్టైన్మెంట్ ని కలిపి చూపిస్తే కచ్చితంగా హిట్ అవుతుందని భావించి My Village Show పేరుతో గ్రామీణ జీవితాన్ని అద్భుతంగా చూపిస్తూ ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు.

మై విలేజ్ షో

ఈ వీడియోలలో చూపించే ఊరు లంబాడిపల్లి, ఇది జగిత్యాల జిల్లా కొండగట్టుకు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అతి తక్కువ ఖర్చుతో ఊర్లో ఉండే మిత్రుల సహకారంతో స్క్రిప్ట్, ఎడిటింగ్, మిక్సింగ్ పనులు చేసుకుంటూ అతి తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యారు. ఊర్లోనే ఉంటూ నలుగురికి పని కల్పిస్తూ ఊరి అభివృద్ధికి కూడా సహాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ ఛానెల్ బృందం.

(Visited 558 times, 581 visits today)

Comments

comments