EDITION English తెలుగు
మూవీ రివ్యూ: 'పేట'   మూవీ రివ్యూ:వినయ విధేయ రామ   మూవీ రివ్యూ:యన్.టి.ఆర్‌ -కథానాయకుడు   5 రూపాయలు తీసుకొని అటే ఉడాయించి ఉంటాడు,అనుకున్న వ్యక్తికీ. సార్ మీ ఛాయ్..అన్న పిలుపుతో అతను షాక్ కు గురయ్యాడు.అసలు ఏమైందో తెలుసా..?   ఈ క్యాబ్ డ్రైవ‌ర్ రాత్రి పూట అవ‌స‌రం ఉన్న వారిని ఉచితంగా క్యాబ్‌లో ఇంటి దగ్గ‌ర దింపుతాడు. ఎందుకో తెలుసా..?   మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు కరెక్ట్ అర్థం ఈ జంటే... వీరి కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. రియల్ స్టోరీ..!   మూవీ రివ్యూ: పడి పడి లేచె మనసు   పొరిగింటి రెండేళ్ల చిన్నారి కోసం...చనిపోతూ ఈ తాత ఇచ్చిన విలువైన బహుమతి ఏంటో తెలుసా..?   కేంద్రం సంచలన నిర్ణయం...! ఇకపై ఆధార్ అడిగితే కోటి జరిమానా...జైలు శిక్ష! వివరాలు ఇవే!   ఎంతపెద్ద జ్వరమైనా ఈ ట్రిక్ పాటిస్తే సింపుల్ గా తగ్గిపోద్ది.! కావాల్సింది పెసరపప్పు ఒక్కటే.!
Home / Reviews / ఛలో సినిమా రివ్యూ & రేటింగ్.

ఛలో సినిమా రివ్యూ & రేటింగ్.

ఛలో రివ్యూ నాగ శౌర్య ఛలో స్టోరీ

Alajadi Rating

3/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: నాగశౌర్య.. రష్మిక మందాన.. నరేష్‌.. వెన్నెల కిషోర్‌.. సత్య.. పోసాని కృష్ణమురళి తదితరులు

Directed by: వెంకీ కుడుముల.

Produced by: ఉషా ముల్పూరి.

Banner: ఐరా క్రియేషన్స్‌.

Music Composed by: మహతి స్వర సాగర్‌.

ఈ మధ్య కొత్త కొత్త దర్శకులు మంచి మంచి కథలతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు, మొదటి సినిమా అనే టెన్షన్ ఏం లేకుండా కేవలం కథని మాత్రమే నమ్ముకొని ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టేస్తున్నారు, ఇప్పుడు వెంకీ కుడుములు అనే యువకుడు కూడా నాగ శౌర్య, రష్మిక మందానలు హీరో హీరోయిన్లుగా ఛలో అనే సినిమాని తీసాడు, పాటలు, ట్రైలర్ లతో ప్రేక్షకులని ఆకట్టుకున్న ఛలో ఈరోజు విడుదల అయింది, మరి సినిమా ఎలా ఉందో తెలుసుకోండి..

కథ:

హరి(నాగశౌర్య)కి చిన్నప్పటి నుంచి గొడవలంటే చాలా ఇష్టం. ఎవరైనా గొడవ పడుతుంటే చూసి ఎంజాయ్ చేస్తుంటాడు. అతడ్ని తిరుప్పురం అనే ఊరు పంపించేస్తాడు తండ్రి. అది ఆంధ్రా, తమిళనాడు బోర్డర్‌లో ఉంటుంది. ఆ రెండు ఊళ్లకు అస్సలు పడదు. తెలుగు వాళ్లు, తమిళుల మధ్య పోరు సాగుతుంటుంది. హరి ఆ ఊరి కాలేజీలో జాయిన్ అవ్వుతాడు. అక్కడ కార్తీక(రష్మిక)ను చూసి ప్రేమిస్తాడు. అయితే, కార్తీక తమిళనాడుకి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయిని ప్రేమించాలంటే వాళ్ళ వర్గం వాళ్ళకి నచ్చాలి. అది జరిగే పనికాదని తెలిసి.. ఆ రెండు ఊళ్లను కలపాలని అనుకుంటాడు. మరి ఆ రెండు ఊళ్లు కలిశాయి? వీళ్ల పెళ్లి జరిగిందా? ఆ ఊళ్ల వెనుక ఉన్న పగ ఏంటి? అన్నదే ‘ఛలో’.

అలజడి విశ్లేషణ:

రెండు ఊర్ల మధ్య ఎప్పటినుండో ఉన్న గొడవలు, హీరో హీరోయిన్ లు వేరు వేరు ఊర్లకి చెందిన వారు, వారి ప్రేమని గెలిపించడం కోసం రెండు ఉర్లని కలుపుతారు, ఈ కథని ఇప్పటికే అనేక తెలుగు సినిమాల్లో చూసాం, కానీ కొత్త డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ కథకి మంచి స్క్రీన్ ప్లే సెట్ చేసి మంచి ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు, హీరో క్యారెక్టర్ కొత్తగా చూపించి ఆకట్టుకున్నాడు, హీరో-హీరోయిన్‌ల మధ్య సాగిన లవ్‌ ట్రాక్‌ కూడా చాలా బాగా రాసుకున్నాడు. ఫస్టాప్‌లో పెద్దగా కథ లేకపోయినా, కామెడీ.. పాటలతో బాగా నవ్వించాడు.

ముఖ్యంగా యూత్ కి కనెక్ట్ అయ్యేలా సినిమాని తీశాడు అని చెప్పొచ్చు, ఇంటర్వెల్ తరువాతే కథ ట్రాక్ లోకి వస్తుంది, రెండు ఊర్లని కలపడానికి హీరో పడ్డ పాట్లు, మధ్య మధ్యలో వెన్నెల కిషోర్, రఘుబాబు కామెడీ బాగా నవ్విస్తాయి, సినిమా మొత్తం బాగా తీసిన క్లైమాక్స్ లో ఆ రెండు ఊర్ల మధ్యలో గొడవలకి అసలు కారణం మాత్రం లాజిక్ లేకుండా ఉంది, అదొక్కటే కొంచెం మాములుగా అనిపిస్తది, చివరగా సినిమా మొత్తం నవ్వుతూ ఎంజాయ్ చేయాలంటే ఛలో కి వెళ్ళండి..

నటీనటుల పెర్ఫార్మన్స్:

హీరో నాగశౌర్య చాలా సింపుల్ గా సినిమాలో నటించాడు, సినిమా మొత్తాన్ని తన నటనతో నడిపించాడు, ఇంకా హీరోయిన్ రష్మిక చాలా బాగా నటించింది, చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది, ఈ సినిమాకి కమెడియన్స్ యే హీరోలు ముఖ్యంగా వెన్నెల కిషోర్, సత్య, రఘుబాబు బాగా చేసారు.

ప్లస్ పాయింట్స్ :

  • స్క్రీన్ ప్లే
  • నాగ శౌర్య, రష్మిక మందాన
  • కామెడీ సీన్స్

మైనస్ పాయింట్స్:

  • క్లైమాక్స్
  • విలన్ క్యారెక్టర్

పంచ్ లైన్: చూసి చూడంగానే నచ్చేస్తుంది ఈ ఛలో…!

(Visited 235 times, 79 visits today)