EDITION English తెలుగు
Home / Latest Alajadi / బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?

బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?

Author:

మెగాబ్రదర్ నాగబాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణపై ఎవరూ ఊహించని విధంగా కామెంట్ చేశారు.”బాలయ్య ఎవరో నాకు తెలియదు, ఐయామ్ వెరీ సారీ. (ఒక్కక్షణం ఆగి) ఏయ్.. బాలయ్య గురించి తెలియదు అన్నానేంటి? బాలయ్య గారు చాలా పెద్ద ఆర్టిస్టు. సీనియర్ మోస్ట్… నేరము శిక్షలో కృష్ణగారు, ఆయన కలిసి యాక్ట్ చేశారు” అని సినీయర్ నటుడు బాలయ్య గురించి చెప్పుకొచ్చారు నాగబాబు.

మేము అడిగింది ఆ బాలయ్య గురించి కాదండీ.. నందమూరి బాలకృష్ణ గురించి అని యాంకర్ అడగ్గాగానే… నాగబాబు రియాక్ట్ అవుతూ ‘నేనెప్పుడూ ఆయన పేరు వినలేదు. నెక్ట్స్ క్వశ్చన్ ప్లీజ్’ అంటూ స్కిప్ చేసే ప్రయత్నం చేశారు. మొన్నటికి మొన్న కేఏ పాల్ అనే పెద్ద మనిషి.. ఓ టీవీ చానల్లో కూర్చుని సీరియస్‌గా.. యాంకర్ బాలకృష్ణ గురించి అడిగితే.. తనకు తెలియదన్నారు. అసలు ఆ సందర్భంలో.. బాలకృష్ణ ప్రస్తావన ఎందుకు తీసుకు రావాల్సి వచ్చిందో యాంకర్‌కే తెలియాలి. బాలకృష్ణ తెలియదని కేఏ పాల్ ఎందుకన్నారో ఇంకో మిస్టరీ. కానీ ఆ వీడియో మాత్రం వైరల్ అయిపోయింది.

watch video:

న‌కు జనసేన పార్టీలో ఓ నాయకుడిగా కంటే సామాన్య కార్యకర్తలా పనిచేయడం తనకు ఇష్టమని ఆ ఇంటర్వూలో తెలిపాడు. మొత్తానికి నాగ‌బాబు చెప్పిన మాట‌లు అటు తెలుగుదేశం వ‌ర్గాల్లో కూడా హాట్ టాపిక్ అయ్యాయి. అంతటా వైరల్ గా మారాయి. ఈ కామెంట్ విన్న బాలకృష్ణ చాలా కోప్పడ్డారని సమాచారం. ఆయన కూడా అతి త్వరలో ఈ విషయమై కౌంటర్ వేస్తారని అంతా భావిస్తున్నారు.

(Visited 1 times, 237 visits today)