EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Entertainment / ఆయనను కలిశాక నా జీవితం కొత్తగా కనిపిస్తోంది – నాగశౌర్య.

ఆయనను కలిశాక నా జీవితం కొత్తగా కనిపిస్తోంది – నాగశౌర్య.

Author:

Naga Shourya Abbayitho Ammayi Movie

‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘లక్ష్మి రావే మా ఇంటికి..’, చిత్రాల ద్వారా లవర్ బాయ్‌లా, మన పక్కింటి కుర్రాడిలా కనిపించి మంచి పేరు సంపాదించుకున్న హీరో నాగశౌర్య, రమేష్ వర్మ దర్శకత్వంలో ‘అబ్బాయితో అమ్మాయి’ తెరకెక్కిన ఈ సినిమా జనవరి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగ శౌర్య తన కెరీర్ గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం తాను చేస్తోన్నవన్నీ ప్రేమకథలే అనీ,‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ వంటి అందమైన ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు దర్శకత్వంలో ఈ సినిమా ద్వారా మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఒక్క మనసు ఒక మెచ్యూర్డ్ లవ్‌స్టోరీ అని, అలాంటి సినిమాలో భాగమవ్వడం తన అదృష్టమని నాగ శౌర్య ఈ సందర్భంగా తెలిపారు. “రామరాజు గారిని కలిశాక నా జీవితం కొత్తగా కనిపిస్తోంది. ఆయన దర్శకత్వంలో వస్తోన్న ‘ఒక్క మనసు’ జీవితాంతం గుర్తుంచుకునే సినిమా” అన్నారు.

టాలీవుడ్లో సాధారణంగా పలువురు సెలబ్రిటీల కుమారులే తప్ప కూతుర్లు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ.అయితే ఇప్పుడు టీవీ యాంకర్‌గా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగబాబు కుమార్తె నిహారిక వెండి తెరపై కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ నేపథ్యంలోనే ‘ఒక మనసు’ సినిమాలో హీరోయిన్‌గా నటించాలని నిర్ణయం తీసుకుంది.

ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం ప్రకాశ్ రాజ్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో నాగశౌర్య తండ్రి పాత్రకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందట.అలాగే నిహారిక తల్లి పాత్ర ప్రముఖ నటి రమ్య కృష్ణ చేయబోతున్నట్లు సమాచారం. సినిమాలో నిహారిక తల్లి పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని, అందుకే రమ్య కృష్ణ లాంటి స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

Comments

comments