EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

నక్షత్రం రివ్యూ & రేటింగ్

నక్షత్రం రివ్యూ

Alajadi Rating

2.5/5.0

Cast: స‌ందీప్‌కిష‌న్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌, రెజీనా, ప్ర‌గ్యా జైశ్వాల్‌, త‌నీష్‌, ప్ర‌కాష్‌రాజ్, జె.డి.చక్ర‌వ‌ర్తి, త‌దిత‌రులు.

Directed by: కృష్ణవంశీ

Produced by: కె.శ్రీనివాసులు, వేణుగోపాల్‌, స‌జ్జు

Banner: బుట్టబొమ్మ క్రియేష‌న్స్‌, విన్ విన్ విన్ క్రియేష‌న్స్‌

Music Composed by: భీమ్స్‌

క్రియేటివ్ డైరెక్టర్ గా స్టార్ ఇమేజ్ అందుకున్న కృష్ణవంశీ కొంతకాలంగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్నాడు. డిఫరెంట్ సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నా స్టార్ ఇమేజ్ అందుకోలేకపోతున్నాడు హీరో సందీప్ కిషన్. మెగా హీరోగా మంచి ఫాంలో కనిపించిన సాయి ధరమ్ తేజ్ కూడా సినిమాల ఎంపికలో తప్పటడుగులతో వరుస ఫ్లాప్ లు చూశాడు. ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన సినిమానే నక్షత్రం. మరి నక్షత్రం వీరి కెరీర్ లను గాడిలో పెడుతుందా..?

కథ:

చిన్నప్పటి నుండి ఎలాగైనా ఎస్సై కావాలనే లక్ష్యంతో ప్రయత్నిస్తుంటాడు రామారావు(సందీప్ కిషన్), అదే లక్ష్యంతో చాలా కష్టపడుతుంటాడు, కొన్ని కారణాల వల్ల చివరి ఆవకాశం కూడా చేజారిపోతుంది, పోలీస్ ఉద్యోగం రాకపోయినా తన ప్రియురాలు (రెజినా) ఇచ్చిన పోలీస్ యూనిఫామ్ వేసుకొని అనధికారంగా డ్యూటీ చేస్తుంటాడు, అలెగ్జాండ‌ర్ పేరుతో డ్యూటీ చేస్తుండగా ఒక బాంబు బ్లాస్ట్ కేసులో పోలీస్ ఆఫీసర్ కిరణ్ రెడ్డి (ప్రగ్యా జైస్వాల్)కి రామారావు చిక్కుతాడు, ఆ తరువాత రామారావుకి ఏమైంది..? అలెగ్జాండ‌ర్ (సాయి ధరమ్ తేజ్) ఎవరు..? రామారావుకి పోలీస్ ఉద్యోగం ఎందుకు రాలేదు..? చివరికి ఏమైంది..? అనేవి తెరమీదనే చూడండి.

అలజడి విశ్లేషణ:

 పోలీసు వ్య‌వ‌స్థ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. మ‌త్తు మందులు, మార‌ణాయుధాల త‌యారీ, బాంబు బ్లాస్ట్ లు త‌దిత‌ర అంశాల్ని స్పృశిస్తూ కృష్ణ‌వంశీ త‌న‌దైన శైలిలో తెర‌కెక్కించారు. తొలి స‌గ‌భాగం క‌థంతా పాత్ర‌ల్ని ప‌రిచ‌యం చేయడంతోనూ.. పోలీసు కావాల‌ని క‌ల‌లుగ‌నే యువ‌కుడి పాత్ర‌లో సందీప్‌కిష‌న్ ప‌డే త‌ప‌న‌తోనూ చాలా స్లోగా ముగిసిపోతుంది.

అస‌లు క‌థ ద్వితీయార్థంలోనే మొద‌ల‌వుతుంది, సాయి ధరమ్ తేజ్ పాత్రా, ప్రగ్యా జైస్వాల్ పాత్రలతో సినిమాని బాగా తెరకెక్కించారు, సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నప్పటికీ ఒక దశలో ప్రగ్యా జైస్వాల్ ఈ క‌థ‌కి హీరోలా అనిపిస్తుంది, కొన్ని కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా ఉన్నట్లు అనిపిస్తాయి, మధ్యమధ్యలో ప్రేక్షకులకి సహన పరీక్షా పెడుతూ క్లైమాక్స్ కి చేరుకుంటుంది సినిమా.

సినిమాలో పాటలు తెరక్కించిన విధానం, హీరోయిన్ల గ్లామర్ బాగానే ఉన్న మ్యూజిక్ మాత్రం ఆకట్టుకోలేపోయింది, ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్ లని పెట్టడం వల్లనేమో కొన్నిచోట్ల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చిరాకు పెట్టించేలా ఉంది, చివరగా ఒక మంచి స్టోరీని ప్రేక్షకులకి అర్థమయ్యేలా చెప్పడంలో కృష్ణవంశీ పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు.

ప్లస్ పాయింట్స్ :

  • క‌థనం
  • ఆకట్టుకునే సెకండ్ హాఫ్
  • సందీప్‌కిష‌న్, ప్ర‌గ్యా జైశ్వాల్ న‌ట‌న

మైనస్ పాయింట్స్ :

  • అనవసర పాత్రలు
  • స్లోగా సాగే ఫస్ట్ హాఫ్
  • క‌థ

పంచ్ లైన్: మెరిసి మెరవని ” నక్షత్రం “.

(Visited 1,283 times, 66 visits today)

Comments

comments