Home / Entertainment / అమెరికాలో కసరత్తులు మొదలుపెట్టేసిన నందమూరి మోక్షజ్ఞ.

అమెరికాలో కసరత్తులు మొదలుపెట్టేసిన నందమూరి మోక్షజ్ఞ.

Author:
nandamuri-mokshagna cinema
నందమూరి నటసింహం బాలకృష్ణ  ఒక వైపు  అభిమానులు, ఇండస్ట్రీ మొత్తం ప్రతిష్టాత్మకంగా ఫీల్ అవుతున్న 100వ సినిమాలో క్రిష్ సారధ్యంలో అఖండ భారతాన్ని ఏలిన ఓ అమరావతి రాజు” గౌతమీ పుత్ర శాతకర్ణి  ” గా అన్నీ సిద్దం చేసుకుంటున్న సమయం లోనే నట వారసడు మోక్షజ్ఞ ని కూడా  నటనా శిక్షణ కోసం విదేశాలు పంపినట్టు సమాచారం.
బాలయ్య మొక్షు ని  స్టైలిష్ గా లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు ,ఆ మద్య అఖిల్ సినిమా విడుదల అయి పరాజయం పాలైనపుడు కూడా “మోక్షజ్ఞ తొలి సినిమా యూత్ ఫుల్ లవ్ స్టోరీతో ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చేలా  ఉండాలి, అలాంటి కథల కోసమే చూస్తున్నాం . ముందు మామూలు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటే …మాస్ ఫాలోయింగ్ అదే వస్తుంది అన్నారు బాలయ్య. నా కొడుకు తొలి సినిమాకే ప్రపంచాన్ని కాపాడేసాడు లాంటి పాత్రలు వద్దు అని బాలయ్య “” అని తన అంతరంగం వెళ్ళబుచ్చారు …
బాలయ్య మాటలు విన్నప్పటి నుండీ  అభిమానులు కూడా ఒడ్డు,పొడుగు ,అందం అన్నీ సరిగ్గా ఉండి డిఫరెంట్ మార్క్ తో రాబోతున్న తమ  కొత్త తరం హీరో పై అంచనాలు పెంచేసుకున్నారు. నందమూరి వంశానికి ఎప్పటి నుంచో ఎలాగూ ఉన్న మాస్ ఫాలోయింగ్ ని కలుపుకుని మొక్షు ఓ క్లాసిక్ ఫ్యామిలీ టచ్ ఇస్తాడో ? మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న ఓ మాస్ హీరో ఫ్యామిలీ హీరోని మంచి ఫ్యామిలీ సినిమాతో జనాలకి దగ్గర చేద్దామన్న బాలయ్య ఐడియా ఎలా సక్సెస్ అవుతుందో త్వరలోనే చూద్దాం, అందాక 100వ సినిమా మొదలు పెట్టేసిన తండ్రికి,మొదటి సినిమాకి సిద్దమవుతున్న తనయుడికి అభిమానులు మరియు ,ప్రత్యేకంగా అలజడి తరపున ఆల్ ది బెస్ట్.
(Visited 258 times, 12 visits today)