Home / Entertainment / కలెక్షన్స్ లో దూసుకెళ్తున్న నేను లోకల్…!

కలెక్షన్స్ లో దూసుకెళ్తున్న నేను లోకల్…!

Author:

సినిమా సినిమాకి తన ఇమేజ్ ని పెంచుకుంటూ పోతున్నాడు నాచురల్ స్టార్ నాని, పోయిన సంవత్సరం వరుసగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టి మంచి ఊపులో ఉన్న నాని నేను లోకల్ అంటూ పక్క కమర్షియల్ సినిమాతో వచ్చాడు, నేను లోకల్ కథ రొటీన్ యే అయిన ఫుల్ ఎంటెర్టైనమెంట్ గా ఉండటంతో అంచనాలని మించి ఆడుతుంది, ఈ సినిమాకి నాని కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి.మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.4.8 కోట్ల షేర్ రాబట్టి ఆశ్చర్యపరిచిన ‘నేను లోకల్’ రెండో రోజు కూడా మంచి వసూళ్లే రాబట్టింది. రూ.3.13 కోట్ల షేర్ సాధించింది. మొత్తం రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల వరకే ఈ చిత్రం రూ.7.54 కోట్ల షేర్ తెచ్చుకుంది. అమెరికాలో ఇప్పటివరకు 353,879 డాలర్లని వసూలు చేసి హాఫ్ మిలియన్ దిశగా దూసుకెళ్తుంది.

Nenu-Local-Collections

నేను లోకల్ సినిమా కలెక్షన్స్: 

  • నైజాం-2.92 కోట్లు
  • సీడెడ్-రూ.99.5 లక్షలు
  • నెల్లూరు- రూ.24.2 లక్షలు
  • గుంటూరు- రూ.62.2 లక్షలు
  • కృష్ణా- రూ.53.4 లక్షలు
  • తూర్పు గోదావరి- రూ.81 లక్షలు
  • పశ్చిమ గోదావరి- రూ.46.5 లక్షలు
  • ఉత్తరాంధ్ర- రూ.95 లక్షలు

మొత్తం ఏపీ-తెలంగాణ రెండు రోజుల షేర్ – రూ.7.54 కోట్లు.

యూఎస్ఏ రెండు రోజుల షేర్- $ 353,879 [ 2.38 కోట్లు]

Also Read: నేను లోకల్ రివ్యూ & రేటింగ్.

Comments

comments