Home / Entertainment / ‘నాన్నకు ప్రేమతో’ ట్రైలర్ ఆలోచింపజేస్తుంది.

‘నాన్నకు ప్రేమతో’ ట్రైలర్ ఆలోచింపజేస్తుంది.

Author:

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బీవిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో వేడుకలో ట్రైలర్ ని విడుదల చేసారు. ఇంతకుముందు ఎన్నడు కనిపించని లుక్ లో జూనియర్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. సుకుమార్ చిత్రాల్లో ఉండే ఎమోషనల్ సన్నివేశాలు, ఆలోచింపజేసే డైలాగులు ఈ ట్రైలర్ లో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ 4 మిలియన్ల వ్యూస్ తో రికార్డు సృష్టించగా తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్ కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఎన్.టి.ఆర్ మాట్లాడుతూ ‘మేమంతా నాన్న పిచ్చోల్లం అండి, ఇది నా సినిమా కాదు సుకుమార్ జీవితం. నా పాత్రలో సుకుమార్ ని ఊహించుకోవాలి, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారి పాత్రలో సుక్కు వాళ్ళ ఫాదర్ ని ఊహించుకోవాలి. మా తల్లి తండ్రులతో పాటు అందరి అమ్మ నాన్నలకు మేమిస్తున్న నీరాజనం ఈ ‘నాన్నకు ప్రేమతో’ సినిమా అని’ అన్నాను. ఈ చిత్రాన్ని జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపాడు.

(Visited 98 times, 22 visits today)