పవన్ కళ్యాణ్,మహేష్ బాబు,ఎన్టీఆర్ ల సరసన చేరనున్న నారా రోహిత్.

Author:

Nara Rohit singing Song

ఈ మద్య “టాలీవుడ్” కథానాయకులు పాటలు పాడటం ట్రెండ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు మరియు ఎన్టీఆర్ ఇంతకు ముందే ఈ హీరోల గొంతు విన్నాం. వీళ్ళ బాట లోనే మరో యువ హీరో నడవనున్నాడు,మొదటి చిత్రం నుండి వైవిధ్యమైన సినిమాలే చేస్తూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న యువ హీరో నారా రోహిత్, ఈ హీరో ఇప్పుడు 6 సినిమాలలో నటిస్తున్నాడు, అసలు విషయానికి వస్తే ….

నారా రోహిత్ – నందిత జంటగా పవన్ సాధినేని దర్శకత్వంలో “సావిత్రి” అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రం ఈ మద్య విడుదల చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బేసిక్ గా వినూత్న కథలతో వెండితెర పై కనిపించే నారా రోహిత్ ఈ సినిమా కోసం మరో ప్రయత్నం చేయనున్నాడు. ఈ సినిమాకు శ్రవణ్ సంగీతం అందిస్తున్నాడు. ఓ అధ్బుతమైన సాంగ్ ను నారారోహిత్ పాడితే బావుంటుందని భావించిన శ్రవణ్ నారారోహిత్ ను రిక్వెస్ట్ చేయడంతో వెంటనే నారారోహిత్ కూడా’ సరే’ అనటం జరింగింది.

(Visited 231 times, 13 visits today)

Comments

comments